తెలంగాణ

telangana

ETV Bharat / business

మొబైల్ పోయినా ఇట్టే​ కనిపెట్టేయొచ్చు! - సాంకేతికత

మీ మొబైల్​ ఫోన్​ పోయిందా...? ఎక్కడుందో తెలుసుకోవాలనుందా..? దేశంలో ఏ ఫోన్​ పోయినా సరే కనుగొనేలా సరికొత్త వ్యవస్థ తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. కొత్త సాంకేతికతతో సిమ్​ తీసేసినా, ఐఎమ్​ఈఐ నెంబర్​ మార్చినా సరే చిటికెలో కనిపెట్టేయొచ్చు.

పోయిన మొబైల్​ కనిపెట్టేందుకు కొత్త సాంకేతికత

By

Published : Jul 8, 2019, 4:01 PM IST

Updated : Jul 8, 2019, 5:35 PM IST

సైబర్ నెట్​వర్క్​ అనుంధానంతో దేశంలో టెలికామ్​ రంగాన్ని మరింత ధృడ పరుస్తూ కేంద్ర ప్రభుత్వం ముందడుగేసింది. చరవాణీలను పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగలించినా ట్రాక్​ చేసి కనిపెట్టే విధంగా సాంకేతికత వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు.

కొత్త వ్యవస్థ వస్తే... మీ మొబైల్​ ఫోన్​లో సిమ్ తీసేసినా, ఐఎమ్​ఈఐ నెంబర్​ మార్చినా ఎక్కడుందో కనుగునే వీలుంటుందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు నుంచే ట్రాకింగ్​కు సంబంధించిన సేవలు తీసుకొస్తామని వెల్లడించారు.

Last Updated : Jul 8, 2019, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details