తెలంగాణ

telangana

ETV Bharat / business

విమానాల్లో ఈ 'యాపిల్'​ ల్యాప్​​టాప్​లపై ​నిషేధం - డీజీసీఏ

యాపిల్‌ 'మ్యాక్‌ బుక్‌ ప్రో' ల్యాప్​టాప్​లకు చెందిన కొన్ని మోడళ్లను విమానాల్లో అనుమతించబోమని విమానయాన నియంత్రణ వ్యవస్థ డీజీసీఏ స్పష్టం చేసింది. ఈ మ్యాక్​ బుక్​ ప్రో పాత వెర్షన్​లోని బ్యాటరీల కారణంగా ప్రమాదాలు జరగవచ్చనే సందేహంతో ఈ నిర్ణయం తీసుకుంది.

యాపిల్

By

Published : Aug 27, 2019, 5:06 AM IST

Updated : Sep 28, 2019, 10:10 AM IST

విమానాల్లో యాపిల్ మ్యాక్​ బుక్​ ప్రోపై నిషేధం

ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని యాపిల్​ 'మ్యాక్​ బుక్​ ప్రో' పాత ల్యాప్​టాప్​ మోడళ్లను విమానంలోకి తీసుకురావద్దని ప్రయాణికులకు సూచించింది డీజీసీఏ. వీటిలోని బ్యాటరీల ఓవర్​ హీటింగ్​ సమస్యతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

2015-17మధ్యలో ఉత్పత్తి చేసిన వాటిల్లో అమర్చిన బ్యాటరీ పేలే ప్రమాదం ఉందని అమెరికా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ సేఫ్టీ కమిషన్‌ పేర్కొంది. జూన్‌ 20లో యాపిల్‌ స్వచ్ఛందంగా 15 అంగుళాల మ్యాక్‌ బుక్‌ ప్రో ల్యాప్​టాప్​లను రీకాల్‌ చేసింది.

యాపిల్‌ లెక్కల ప్రకారం 26 కేసుల్లో మ్యాక్‌బుక్‌ ప్రో విపరీతంగా వేడెక్కినట్లు తేలింది. ఈ ప్రమాదాల్లో ఐదుగురు వినియోగదారులకు స్వల్పగాయాలు అయ్యాయి. పొగ వెలువడటం వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయి.

ఇదీ చూడండి: రెడ్​మీ నోట్​ 8... మరో సూపర్ బడ్జెట్​ ఫోన్​ అవుతుందా?

Last Updated : Sep 28, 2019, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details