కరోనాపై పోరుకు తమవంతు సాయంగా దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్రముఖ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ క్రాప్ (ఓఎన్జీసీ), ఇండియన్ క్రాప్ (ఐఓసీ) సహా ఇతర ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కలిసి రూ. 1000 కోట్లను పీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ప్రకటించాయి.
ఓఎన్జీసీ రూ.300 కోట్లు ఇవ్వగా.. ఐఓసీ సంస్థ రూ.225 కోట్లు ప్రకటించింది. భారత్ పెట్రోలియమ్ క్రాప్ లిమిటెడ్ (బీపీసీఎల్) రూ.175 కోట్లు, హిందుస్థాన్ పెట్రోలియం క్రాప్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రూ. 120 కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. వీటితో పాటు ఇతర ఎల్ఎన్జీ, జీఏఐఎల్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థలూ తమ వంతు సాయాన్ని ప్రకటించాయి.
ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ దాల్మియా భారత్ గ్రూప్.. మంగళవారం రూ. 25 కోట్లను పీఎం కేర్స్ ఫండ్‌కు ప్రకటించింది.
కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరగకుండా పోరాడుతున్నాయి. మా వంతు సాయంగా రూ. 25 కోట్లను అందిస్తున్నాం. వైరస్‌తో పోరాడేందుకు ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చేందుకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాం.
దాల్మియా సిమెంటు