కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్.. వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారు. సిద్ధార్థ కనిపించకుండా పోవడానికి ఆర్థిక ఇబ్బందులే కారణంగా తెలుస్తోంది. కాఫీ డే ఉద్యోగులు, డైరెక్టర్లకు సిద్ధార్థ రాసిన లేఖ తాజాగా బయటపడింది.
"ప్రతి ఆర్థిక లావాదేవీకి నాదే బాధ్యత. ఎవరినీ మోసం చేయాలన్నది నా ఉద్దేశం కాదు. ఒక వ్యాపారవేత్తగా నేను విఫలం అయ్యాను. నన్ను అర్థం చేసుకుని, మన్నిస్తారని ఆశిస్తున్నా. ఈ లేఖతో పాటు నా ఆస్తుల వివరాలతో కూడిన ఓ పత్రాన్ని పొందుపరుస్తున్నాను. నా ఆస్తుల విలువ అప్పులకన్నా ఎక్కువే ఉంది. రుణదాతలు అందరికీ తిరిగి చెల్లించేందుకు వీలు ఉంటుంది" అని సిద్ధార్థ లేఖలో పేర్కొన్నారు. నూతన యాజమాన్యంతో కాఫీ డే వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు తన లేఖలో స్పష్టం చేశారు సిద్ధార్థ్.
కాఫీ డే సంస్థ వివిధ బ్యాంకులకు రూ. 8082.63 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉందని సమాచారం. ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్‌కు రూ. 4475 కోట్లు, యాక్సిస్ ట్రస్టీ సర్వీసెస్‌కు రూ. 915 కోట్లు, యాక్సిస్ బ్యాంక్‌కు రూ. 315 కోట్ల రుణాలు కాఫీ డే సంస్థ చెల్సించాల్సి ఉంది.
కాఫీడే చెల్లించాల్సిన రుణాల పూర్తి వివరాలు: