లండన్ ఆధారిత లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఓ మధ్యవర్తి ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్ఏఎల్, ఓఎన్జీసీ, గెయిల్‌తో ఒప్పందాలకు ప్రయత్నించిందని సీబీఐ ఆరోపించింది. ఐదేళ్ల ప్రాథమిక దర్యాప్తు తర్వాత ప్రధాన సంస్థతో పాటు భారత్‌లోని శాఖపైనా కేసు నమోదు చేసింది సీబీఐ.
అవినీతి కేసులో రోల్స్‌రాయిస్‌పై సీబీఐ కేసు - గెయిల్
ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. హెచ్ఏఎల్, ఓఎన్జీసీ, గెయిల్‌తో ఒప్పందాల కోసం అవినీతికి పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది.
రోల్స్‌రాయిస్‌పై సీబీఐ కేసు
సమగ్రమైన ఒప్పందాలు లేకుండా ఏజెంట్ సేవలను రోల్స్ రాయిస్ ఆశ్రయించిందని సీబీఐ తెలిపింది. 2000-13 మధ్య కాలంలో హెచ్ఏఎల్తో రూ.4,736 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుందీ కార్ల సంస్థ. విడి భాగాల కోసం గెయిల్, ఓఎన్జీసీతో ఒప్పందాలు జరిగాయి.
ఇదీ చూడండి: వినియోగదారుల రక్షణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం