తెలంగాణ

telangana

ETV Bharat / business

డొల్ల సంస్థల లెక్క తేల్చండి : ఐటీ శాఖతో సీబీడీటీ

అక్రమ నగదు బదిలీకి పాల్పడ్డ డొల్ల సంస్థలపై విచారణ జరపాలని ఐటీ శాఖను ఆదేశించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు సమయంలో అనుమానాస్పదంగా వ్యవహరించిన, అక్రమ లావాదేవీలకు పాల్పడ్డ, పన్ను ఎగవేత అభియోగాలతో ఎంసీఏ నిషేధానికి గురైన మూడు లక్షల కంపెనీలపై విచారణ జరపాలని సూచించింది.

ఐటీశాఖ

By

Published : Mar 29, 2019, 3:41 PM IST

దేశవ్యాప్తంగా ఉన్న మూడు లక్షల డొల్ల సంస్థలపై విచారణకు ఆదేశించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ). కార్పొరేట్ వ్యవహారాల​ మంత్రిత్వ శాఖ నిషేధం విధించిన కంపెనీలపై సమగ్ర విచారణ చేపట్టాలని దేశంలోని అన్ని ఆదాయ పన్ను శాఖలను ఆదేశించింది సీబీడీటీ.

పన్ను ఎగవేతకు ఆయా కంపెనీలు అందించిన తప్పుడు సమాచారంపై విచారణ జరపాలని సూచించింది. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆ సంస్థల పనితీరుపై దర్యాప్తు జరపాలని ఆదేశించింది.

"ఆయా కంపెనీలు పన్ను ఎగవేత కోసం ఎలాంటి తప్పుడు సమాచారం సమర్పించాయనే అంశాలను సేకరించాలి. నిషేధం తర్వాత వాటి లావాదేవీలను పరిశీలించాలి" అని ఐటీ శాఖలకు సీబీడీటీ సూచించింది.

వీటిలో చాలా కంపెనీలు యథేచ్ఛగా పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే సమాచారం తమ వద్ద ఉన్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అది నిరూపితమైతే... ఆ సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు.

అదే విధంగా ఆ కేసును ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ (ఈడీ)కు అప్పగించి, పన్ను ఎగవేత కింద విచారణకు ఆదేశించనున్నట్లు పేర్కొన్నారు.
ఒకవేళ కంపెనీలు అనుమానాస్పదమైన లావాదేవీలు జరిపినట్లయితే ఐటీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదాయపన్ను శాఖ అధికారులను ఆదేశించింది సీబీడీటీ.

గతేడాది కూడా ఇలాంటి చర్యలు చేపట్టింది బోర్డు. అవసరమైతే ఆయా కంపెనీలపై ఉన్న అభియోగాలను జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్​ ఎదుట ఉంచాలని ఐటీ శాఖను ఆదేశించింది.

దీని ద్వారా ఆ డొల్ల కంపెనీలు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల పన్నును రాబట్టాలని సూచించింది సీబీడీటీ.

ABOUT THE AUTHOR

...view details