భారత్‌లో నిషేధం ఎదుర్కొంటున్న టిక్‌టాక్ వ్యాపారాలను విక్రయించేందుకు దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు టిక్‌టాక్ ఇండియాను విక్రయించేందుకు బైట్‌డ్యాన్స్ ఆసక్తి చూపుతున్నట్లు టెక్ క్రంచ్ నివేదిక వెల్లడించింది. ఇందుకోసం ఇరు సంస్థలు జులై చివరి వారం నుంచే చర్చలు ప్రారంభించినట్లు నివేదిక తెలిపింది. అయితే ఇంకా ఈ ఒప్పందం గురించి ఇరు సంస్థలు తుది నిర్ణయానికి రాలేదని పేర్కొంది.
మైక్రోసాఫ్ట్-టిక్ టాక్ డీల్ కష్టమే?
మరోవైపు టిక్‌టాక్ అమెరికా సహా అంతర్జాతీయ వ్యాపారాల కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే టిక్‌టాక్‌ను తక్కువ విలువకే దక్కించుకోవాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోందని.. ఇందుకోసం ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు లేవని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్- రిలయన్స్ ఒప్పందంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.