ఇండిగో షేర్లు 8 శాతం పతనం
దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో షేర్లు దాదాపు 7.55 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. సంస్థ ప్రమోటర్ల మధ్య వివాదమే ఇందుకు కారణం.
బీఎస్ఈలో ఇండిగో షేరు ధర ప్రస్తుతం రూ. 1,487.10 వద్ద కొనసాగుతోంది.
కొత్త ఉత్సాహంతో టాటా కెమికల్స్
టాటా కెమికల్ షేర్లు మిడ్ సెషన్లో దాదాపు 9 శాతం పుంజుకున్నాయి. బ్రాండెడ్ ఆహార వ్యాపారాలను టాటా కెమికల్స్ నుంచి టాటా బేవరేజెస్‌కు బదీలీ చేస్తున్నట్లు టాటా గ్రూపు ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో షేర్లు కొత్త ఉత్సాహంతో కొనసాగుతున్నాయి.
బీఎస్ఈలో షేరు ధర ప్రస్తుతం రూ. 604 వద్ద ఉంది.