తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫోన్​ తాకకుండా నెట్ బ్యాంకింగ్​ చేయండిలా... - latest digital features

డిజిటల్ లావాదేవీల సంస్థ భారత్​పే తన యాప్​లో రెండు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. పైసాబోలేగా, భారత్​పే బ్యాలెన్స్​ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. కరోనా కాలంలో వ్యాపారుల ఇబ్బందులను దూరం చేసేందుకు ఈ యాప్​ను తీసుకొచ్చినట్లు సంస్థ స్పష్టం చేసింది.

BharatPe
భారత్​పే

By

Published : May 5, 2020, 10:24 AM IST

డిజిటల్ లావాలేవీల సంస్థ భారత్​పే.. తన వినియోగదారులకు రెండు సరికొత్త ఫీచర్లలను సోమవారం అందుబాటులోకి తెచ్చింది. కరోనా కాలంలో వాయిస్​ ఆధారిత సేవల లావాదేవీలతో పాటు బ్యాలెన్స్​ చూసుకునే అవకాశాన్ని కల్పించింది.

పైసా బోలేగా.. క్యూఆర్​ కోడ్​ ద్వారా లావాదేవీలు చేసినప్పుడు వ్యాపారులకు వాయిస్​ నోటిఫికేషన్​ వస్తుంది. డబ్బు ఎంత చెల్లించారన్న విషయాన్ని దుకాణదారుడికి స్మార్ట్ ఫోన్​ స్పీకర్​ ద్వారా తెలియజేస్తుంది.

భారత్​పే బ్యాలెన్స్​.. దుకాణదారుడి ఖాతాలో మొత్తాన్ని ఎప్పటికప్పుడు చూసుకునే వీలు కల్పించింది. డిపాజిట్లు, రుణాలు, క్యూఆర్​ ద్వారా జరిగిన రోజువారీ చెల్లింపులను పరిశీలించుకోవచ్చు.

పెరిగిన వ్యాపారం..

ఈ రెండు ఫీచర్లతో దుకాణదారుడు తరచూ ఫోన్​ చూసుకునే అవసరం లేదని సంస్థ తెలిపింది. వీటితో పాటు రోజువారీ లావాదేవీలకు సంబంధించి జాబితాను రూపొందిస్తుంది. ఈ సదుపాయాలన్నీ ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు భారత్​పే సీఈఓ అష్​నీర్​ ​ గ్రోవర్​.

కరోనా లాక్​డౌన్​ వేళ డిజిటల్ పేమెంట్లకే మొగ్గుచూపుతున్న కారణంగా భారత్​పే వ్యాపారం పెరిగింది. ఒక దుకాణదారుడిపై సగటు 70 ఆదాయం పెరిగినట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details