ముద్రా రుణాల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంకా దాదాపు రూ. లక్ష కోట్లు మంజూరు చేయాల్సి ఉంది. ఇందుకు మిగిలి ఉన్న గడువు కొద్దిరోజులే. ప్రభుత్వం ప్రకటించిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
మార్చి 31తో ముగియనున్న 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.3లక్షల కోట్లు రుణాలు ఇవ్వాలన్నది ముద్రా పథకం లక్ష్యం.
ఆర్థిక శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 22 నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు ముద్రా పథకం కింద రూ. 2,10,758.51కోట్ల రుణాలు మంజూరు చేశాయి. వాటిలో రూ.2,02,668.9 కోట్లు లబ్ధిదారులకు అందించాయి. మొత్తం 3.89 కోట్ల ముద్రా రుణాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేశాయి.