తెలంగాణ

telangana

ETV Bharat / business

అజిమ్​ ప్రేమ్​జీ నుంచి 1.22 కోట్ల షేర్ల బైబ్యాక్!

అజిమ్​ ప్రేమ్​జీ సహా.. ఇతర ప్రమోటర్​ గ్రూప్​ల నుంచి రూ.7,300 కోట్లు విలువైన 22.46 కోట్ల షేర్లు బైబ్యాక్​ చేసినట్లు విప్రో వెల్లడించింది. మొత్తం రూ.10,499.99 కోట్లు విలువైన ఈ బైబ్యాక్​ ఆఫర్​ ముగిసిన తర్వాత విప్రోలో 74.05 శాతం వాటా ప్రమోటర్ల సొంతమైంది.

విప్రో

By

Published : Sep 11, 2019, 4:09 PM IST

Updated : Sep 30, 2019, 5:58 AM IST

గత నెలలో ముగిసిన బైబ్యాక్​ ఆఫర్​లో.. అజిమ్​ ప్రేమ్​జీ సహా ఇతర ప్రమోటర్​ గ్రూపు సంస్థలు రూ.7,300 కోట్లకు 22.46 కోట్ల షేర్లు విక్రయించినట్లు దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ప్రకటించింది.

పూర్తి బైబ్యాక్ ఆఫర్లో ఒక్కో షేర్​కు రూ.325 చొప్పున మొత్తం.. 32.3 కోట్ల షేర్లు కొనుగోలు చేసినట్లు బీఎస్​ఈకి నివేదించింది విప్రో. బైబ్యాక్​ కోసం రూ.10,499.99 వెచ్చించినట్లు పేర్కొంది.

ఈ బైబ్యాక్​ ద్వారా కొనుగోలు చేసిన షేర్లలో.. అజిమ్​ ప్రేమ్​జీ భాగస్వామ్యంలోని జష్​ ట్రేడర్స్​కు ఉన్న 6.12 కోట్ల షేర్లు, ప్రజిమ్ ట్రేడర్స్​కు చెందిన 6.03 కోట్ల షేర్లు, హశమ్​ ట్రేడర్స్​కు చెందిన 5.02 కోట్ల షేర్లు ఉన్నట్లు విప్రో తెలిపింది.

వీటితోపాటు అజిమ్ ప్రేమ్​జీ ట్రస్ట్​కు చెందిన 4.05 కోట్ల షేర్లు, అజిమ్​ ప్రేమ్​జీకి చెందిన 1.22 కోట్ల షేర్లు బై బ్యాక్​ చేసినట్లు విప్రో పేర్కొంది. ఈ బైబ్యాక్ ఆఫర్​కు ప్రేమ్​ జీ అంగీకరించినట్లు స్పష్టం చేసింది విప్రో.

ఇదే ఆఫర్లో ఎల్​ఐసీ వద్ద ఉన్నవాటిలో 1.34 కోట్ల షేర్లు బైబ్యాక్​ చేసినట్లు పేర్కొంది విప్రో. ఈ భారీ బైబ్యాక్ ఆఫర్​ ముగిసిన తర్వత విప్రోలో 74.05 శాతం వాటా ప్రమోటర్ల హస్తగతమైంది.

ఇదీ చూడండి: సాంకేతికం: ఐఫోన్‌11 వచ్చేసిందోచ్.. ధరెంతంటే..!

Last Updated : Sep 30, 2019, 5:58 AM IST

ABOUT THE AUTHOR

...view details