తెలంగాణ

telangana

ETV Bharat / business

రివర్స్​ గేర్​లో వెళ్తున్న 'ఆటో'కు రైల్వే చేయూత

సంక్షోభంలో చిక్కుకున్న ఆటోమొబైల్ రంగానికి భారత రైల్వే.. చేయూతనిచ్చేందేకు సిద్ధమైంది. ఖర్చులు తగ్గించేందుకు గాను.. ముడి సరుకు రవాణా సౌకర్యాలు పెంచాలన్న వాహన తయారీ సంస్థల డిమాండుకు సానుకూలంగా స్పందించింది. కొన్ని రకాల ముడి సరుకుల రవాణాపై ఛార్జీలూ రద్దు చేసినట్లు ప్రకటించింది రైలే శాఖ.

By

Published : Sep 13, 2019, 2:16 PM IST

Updated : Sep 30, 2019, 11:10 AM IST

ఆటోమొబైల్​ రంగానికి రైల్వే చేయూత..

కొన్నేళ్లుగా ఎన్నడూ లేనంతగా ఆటోమొబైల్ పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి వాహన తయారీ సంస్థలు. ఇందుకోసం ముడి సరుకుకు సదుపాయాలు పెంచాలని రైల్వే శాఖను కోరాయి. సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

"భారత రైల్వేకు హోండా, మహీంద్రా, కియా, ఫోర్డ్​ వంటి కంపెనీలు సహా ఇతర కంపెనీల నుంచి ముడి సరుకు రవాణాకు సౌకర్యాలు పెంచాలని డిమాండు వస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు కొన్ని రకాల ముడి సరుకు రవాణాపై ఛార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం." - పూర్ణేందు శేఖర్​ మిశ్రా, రైల్వే బోర్డు సభ్యుడు

ఉత్పత్తి నుంచి వినియోగం వరకు అటోమొబైల్​ రంగం ద్వారా రైల్వేలో రెండు శాతం వరకు వ్యాపారం జరుగుతోంది. ర్యాక్​ల సరఫరాను అధికం చేసి.. ఈ వ్యాపారాలను 8-10 శాతనికి పెంచుకోవాలని చూస్తున్నట్లు మిశ్రా తెలిపారు.

ఆటోమొబైల్​ రంగానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 500 మిలియన్​ టన్నుల ముడి సరుకు రవాణా చేసింది భారత రైల్వే. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 1,225 మిలియన్​ టన్నుల సరుకు రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చూడండి: '5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం'

Last Updated : Sep 30, 2019, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details