తెలంగాణ

telangana

ETV Bharat / business

త్రినేత్ర.. కొత్త ఐఫోన్​ ప్రత్యేకత ఇదే!

మూడు కెమెరాలతో కూడిన కొత్త ఐఫోన్​ తయారీకి ఉపక్రమించింది మొబైల్​ దిగ్గజ సంస్థ ఆపిల్​. ఇందులో త్రీడీ సాంకేతికతతో అద్భుతమైన చిత్రాలను తీసే వీలుంటుందని తెలుస్తోంది. ఇదే కాకుండా ఐదో తరం (5జీ) సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది.

By

Published : May 28, 2019, 5:51 AM IST

Updated : May 28, 2019, 7:37 AM IST

ఆపిల్​

కొత్తగా మార్కెట్​లోకి రానున్న ఐఫోన్​లలో అత్యాధునిక సదుపాయాలను కల్పించనుంది ఆపిల్ సంస్థ. 2019 సెప్టెంబర్​లో ఈ ఫోన్​ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కెమెరా, తెర, టచ్​ ఐడీలలో మార్పులు చేయనున్నట్టు సమాచారం. జులై, ఆగస్టు సమయంలో వీటి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది.

కొత్త రకం మోడళ్లలో ఐదో తరం(5-జీ) సాంకేతికతను అందించనుంది ఆపిల్. కెమెరా పనితీరు మెరుగుపరిచేందుకు 3-డీ సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఇందుకోసం మూడు వెనుక కెమెరాలను అమర్చనుంది. అంతేకాకుండా పూర్తి టచ్​ ఐడీ కలిగిన ఎల్జీ ఓఎల్​ఈడీ తెరలను తీసుకురానుంది. ఈ ఐఫోన్లలో అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్​ నుంచే ఎయిర్ ​పాడ్స్​, ఆపిల్​ వాచ్​ను ఛార్జ్​ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

2019, 2020 మోడళ్ల ఐఫోన్​ తయారీ కోసం ఆసియా కంపెనీల వైపు ఆ సంస్థ చూడనుందని బార్క్​లేస్​ విశ్లేషకులు బ్లేన్​ కుర్తీస్​ అభిప్రాయపడ్డారు. ఐపోన్​కు ఓఎల్​ఈడీ తెరలను అందించటంలో ఎల్జీ సంస్థ రెండో స్థానానికి చేరనుంది. సామ్​సంగ్​ ద్వారా 10 నుంచి 30 శాతం ఆర్డర్లను ఎల్జీ దక్కించుకునే అవకాశముందని చెప్పారు కుర్తీస్.

ఇదీ చూడండి: భారత మార్కెట్​ నుంచి సోనీ ఫోన్లు ఔట్

Last Updated : May 28, 2019, 7:37 AM IST

ABOUT THE AUTHOR

...view details