గడచిన 14 నెలల్లో తాము రూ.35,000 కోట్ల అప్పులు చెల్లించామని రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. ఆస్తుల విక్రయం ద్వారా ఇతర బకాయిలనూ తీరుస్తామని ధీమా వ్యక్తం చేశారాయన.
రుణదాతల నుంచి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ రూ. 35,000 కోట్లు తిరిగి చెల్లించామన్నారు అనిల్ అంబానీ. ఇందులో రూ. 24,800 కోట్లు అసలు, వడ్డీ కింద రూ.10,600 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాలను 2018 ఏప్రిల్ 1 నుంచి 2019 మే 31 మధ్య చెల్లించినట్లు పేర్కొన్నారు.
నియంత్రణ సంస్థలు గానీ, రుణదాతలు గానీ తమకు చేయూతనివ్వలేదని ఆయన చెప్పారు. ఈ కారణంగా వడ్డీ రూపంలో మరింత భారం పడిందని వివరించారు.