తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్​ ప్రైమ్​ డే! కార్మికుల బంద్​ టుడే!! - profit

అమెజాన్ ప్రైమ్​ డే...! ఆన్​లైన్​ కొనుగోలుదారులకు ఈ రెండు రోజులు ఆఫర్ల పండుగే. సంస్థకు వచ్చే లాభాలూ ఆ స్థాయిలోనే ఉంటాయి. కానీ... ఇంతటి కీలకమైన సమయంలో అమెజాన్​కు పెద్ద షాక్​ తగిలింది. అమెరికా మిన్నెసోటాలోని గోదాములో పనిచేసే కార్మికులు... బంద్​ చేపట్టారు. లాభాల జోరుకు స్పీడ్ బ్రేకర్​ వేశారు.

అమెజాన్​ ప్రైమ్​ డే! కార్మికుల బంద్​ టుడే!!

By

Published : Jul 16, 2019, 11:34 AM IST

Updated : Jul 16, 2019, 1:19 PM IST

అమెజాన్​ ప్రైమ్​ డే! కార్మికుల బంద్​ టుడే!!
అమెరికా మిన్నెసోటాలోని అమెజాన్ ప్రధాన​ గోదాములో పనిచేసే కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. సంస్థలో ఉద్యోగ భద్రత, సమాన హక్కులు కల్పించాలని వారు డిమాండ్​ చేశారు. కార్మికులను రోబోల్లా కాకుండా మనుషుల్లా పరిగణించాలని నినదిస్తూ నిరసన తెలిపారు. అదును చూసి...

ప్రైమ్​ డే పేరిట సోమ, మంగళవారాల్లో భారీ డిస్కౌంట్​ ఆఫర్లు ప్రకటించింది అమెజాన్​. ఈ రెండు రోజుల్లో కోనుగోళ్లు భారీగా ఉంటాయి. ఈ వ్యాపారమంతా అమెజాన్​ గోదాములతోనే ముడిపడి ఉంటుంది. ఇలాంటి కీలకమైన సమయంలో సమ్మెకు దిగడం ద్వారా సమస్య తీవ్రతను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కార్మికులు.

"అమెజాన్​కు ప్రైమ్​డే చాలా కీలకమని మాకు తెలుసు. ఈ రోజు తెలిపితేనే నిర్వాహకులకు మా నిరసన తీవ్రత అర్థమౌతుంది. మేము అమెజాన్​కు ఎంతో సంపద తెచ్చిపెడుతున్నాము. కానీ, వారు మమ్మల్ని గౌరవిచడం లేదు, మర్యాదగా చూసుకోవడం లేదు."
- సఫియో మహ్మద్​, అమెజాన్​ కార్మికుడు

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన జెఫ్​ బెజోస్​ సంస్థలో కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్​​, బెర్నీ సాండర్స్... కార్మికులకు ట్విట్టర్​ ద్వారా మద్దతు ప్రకటించారు.

"అమెజాన్​ గిడ్డంగులలోని ధైర్యవంతులైన కార్మికుల నిరసనకు నా సంఘీభావం తెలుపుతున్నాను."
-బెర్నీ సాండర్స్​, డెమొక్రటిక్ పార్టీ నేత

అమెజాన్​ యాజమాన్యం మాత్రం కార్మికుల సేవలకు గంటకు రూ.1000 చెల్లిస్తున్నామని, వారిని అన్ని రకాలుగా బాగా చూసుకుంటున్నామని తెలిపింది. ఈ బంద్​... సంస్థ కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం చూపదని చెప్పింది.

ఇదీ చూడండి:'డిజిటల్​ కిరాణం'లో దూసుకెళ్తున్న భారత్​

Last Updated : Jul 16, 2019, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details