ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సారి 'గ్రేట్ ఇండియా సేల్' నిర్వహించేందుకు సిద్ధమైంది. 2020లో తొలి సారి వస్తున్న ఈ ఆఫర్ జనవరి 19 నుంచి 22 వరకు అందుబాటులో ఉండనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ప్రైమ్ సభ్యత్వం ఉన్న వినియోగదారులకు జనవరి 18 మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ ఆఫర్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.
ఈ నెల 19 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ - అమెజాన్ లేటస్ట్ ఆఫర్లు
ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునేవారికి మరో సారి గుడ్ న్యూస్ చెప్పింది అమెజాన్ ఇండియా. ఈ నెల 19 నుంచి 22 వరకు 'అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్' నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ ఆఫర్కింద భారీ డిస్కౌంట్లతో విక్రయాలు జరపనున్నట్లు తెలిపింది. మరి ఆ ఆఫర్లు ఏంటో తెలుసుకోండి ఇప్పుడే.
అమెజాన్
'అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్'లో షాపింగ్ చేసేవారికి భారీ డిస్కౌంట్లతో పాటు.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపు లభించనున్నట్లు వెల్లడించింది.స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, సౌందర్య సాధనాలు, భారీ గృహోపకరణాలు, టీవీలు, నిత్యవసరాలు సహా అన్ని రకాల ఉత్పత్తులు ఈ ఆఫర్లో భారీ డిస్కౌంట్లలో లభించనున్నట్లు అమెజాన్ ఇండియా పేర్కొంది.
ఇదీ చూడండి:బెంజ్కే మళ్లీ లగ్జరీ కార్ల మార్కెట్ కింగ్ కిరీటం
Last Updated : Jan 11, 2020, 7:46 AM IST