కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్న వేళ.. ప్రముఖ టెలికామ్ సంస్థ ఎయిర్టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార సంస్థ ఉద్యోగులు తమ ఇళ్ల నుంచి సమర్థవంతంగా, సురక్షితంగా పని చేసుకునేలా 'వర్క్ ఫ్రం హోం సొల్యూషన్స్'ను ప్రారంభించినట్లు తెలిపింది.
తమ కస్టమర్లు వ్యాపార కార్యకలాపాలను కొనసాగించేందుకు వీలుగా.. వైర్లెస్, డిజిటల్ సాధానాలు, అత్యుత్తమ కనెక్టివిటీ వంటి సదుపాయాలను ఈ పద్దతి ద్వారా కల్పిస్తున్నట్లు ఎయిర్టెల్ వివరించింది.
"ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కొత్త తరహా పని విధానాలతో వ్యాపార సంస్థలు ముందుకు సాగుతున్నాయి. ఉద్యోగులు ఎక్కువగా ఇంటి నుంచి పనులు చేయడం సర్వసాధారణమైపోయింది".