ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ట్రేడ్ యూనియన్లు పౌర విమానయాన శాఖ సహాయమంత్రి హర్దీప్ పూరీతో సోమవారం సమావేశం కానున్నాయి. ఈ భేటీలో ట్రేడ్ యూనియన్లు తమకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెండోసారి..
ఎయిర్ఇండియా ప్రైవేటీకరణకు కసరత్తు ముమ్మరమైన నేపథ్యంలో.. సంస్థ ట్రేడ్ యూనియన్లతో వరుస చర్చలు జరుపుతున్నారు హర్దీప్ పూరీ. ఇందులో భాగంగా ఈ నెలలో రేపు రెండో సారి సమావేశం కానున్నారు.
భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ఇండియాను గట్టెక్కించేందుకు తమ ముందున్న ఏకైక మార్గం 100 శాతం వాటాను ప్రైవేటు సంస్థలకు విక్రయించడం మాత్రమేనని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగా ప్రైవేటీకరణకు సంస్థ ఉద్యోగుల మద్దతు కోసం.. ఈ నెల 2న సంస్థ యూనియన్లతో తొలి దఫా చర్చలు జరిపింది.
వీఆర్ఎస్ డిమాండ్ అందుకే..
ప్రభుత్వంతో తొలి దఫా చర్చలు జరిపినప్పుడు.. ఉద్యోగ భద్రత కల్పించమని మాత్రమే కోరామని.. అప్పుడు వీఆర్ఎస్ గురించి ఆలోచించలేదని ట్రేడ్ యూనియన్ వర్గాలు వెల్లడించాయి.