తెలంగాణ

telangana

ETV Bharat / business

పాత విమానాలకు ఎయిర్ ఇండియా రిపేర్లు! - సేవల్లో పునరుద్ధరణ

సేవలు నిలిపివేసిన విమానాలను తిరిగి నడిపించేందుకు ఎయిర్​ ఇండియా నడుం బిగించింది. నిధుల కొరతతో నేలకే పరిమితమైన 17 విమానాలను అక్టోబర్​ చివరి నాటికి పునరుద్ధరించాలని భావిస్తోంది.

ఎయిర్ ఇండియా

By

Published : Jul 23, 2019, 6:40 PM IST

చాలా కాలంగా నేలకే పరిమితమైన 17 విమానాల కార్యకలాపాలను పునరుద్ధరించనున్నట్లు ఎయిర్​ ఇండియా ఛైర్మన్ అశ్విని లోహాని వెల్లడించారు.

ఈ విమానాల్లో 4 నెలల నుంచి ఏడాదిలోపు కార్యకలాపాలకు దూరమైనవి ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో వాటిని నిర్వహించలేక కార్యకలాపాలు నిలిపేసింది ఎయిర్ ఇండియా.

17 విమానాల్లో ఎనిమిదింటిని ఆగస్టు చివరి నాటికి.. మిగతా 9 విమానాలను అక్టోబర్ చివరి నాటికి పువరుద్ధరించాలని ఎయిర్​ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.

ఎయిర్​ ఇండియా నుంచి మరిన్ని అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభిస్తామని.. పౌర విమానయాన మంత్రి సర్​దీప్ సింగ్ పూరి కొన్ని వారల క్రితం ప్రకటన చేశారు. ఆ తర్వాతే ఎయిర్​ ఇండియా ఈ పునరుద్ధరణ ప్రణాళిక ప్రకటించడం గమనార్హం.

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్​ ఇండియా రూ.7,600 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. అదే సమయానికి సంస్థ పూర్తి రుణ భారం రూ.58,300 కోట్లుగా ఉంది.

ఇదీ చూడండి: 'ఉల్లంఘన' కేసులో అనిల్​ అంబానీకి ఊరట

ABOUT THE AUTHOR

...view details