విమాన ప్రయాణికులకు పెద్ద శుభవార్త. 50 శాతం తక్కువ ధరకే టికెట్ పొందాలనుకుంటే కేరాఫ్ అడ్రెస్ ఎయిర్ ఇండియా. చివరి నిమిషంలో టికెట్లు కోరే వారికి ఇలా తక్కువ ధరకే అమ్మనున్నట్లు ప్రకటించిందీ సంస్థ.
చౌకగా టికెట్లు దక్కించుకునేందుకు పెద్ద తతంగం ఉంటుందండోయ్. మీరు బ్యాగు సర్దుకుని విమానాశ్రయాల్లో వేచి చూడాల్సి ఉంటుంది. ఇదేమంటారా? ఎయిర్ ఇండియా నిబంధన అలాగే ఉంది మరి. విమానం బయలుదేరడానికి ముందు మూడు గంటల్లోపు టికెట్లు కోరే వారికి ఇలా 50 శాతం తక్కువకే కేటాయించాలని నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ.