తెలంగాణ

telangana

By

Published : Mar 26, 2019, 1:09 PM IST

ETV Bharat / business

'కింగ్​ఫిషర్​కో న్యాయం... జెట్​​కో న్యాయమా..?'

కర్ణాటక హైకోర్టు వద్ద ఉన్న తన ఆస్తులను అమ్మి జెట్​ ఎయిర్​వేస్​ను కాపాడాలంటూ బ్యాంకులకు చురకలంటించారు విజయ్​ మాల్యా. తాను సొమ్ము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా బ్యాంకులు ముందుకురాకపోవడం హాస్యాస్పదంగా అనిపిస్తోందన్నారాయన. ఎన్డీఏ హయాంలో బ్యాంకులు ద్వంద్వ నీతితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు మాల్యా.

మాల్యా

ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూలండన్​లో తలదాచుకుంటున్న వ్యాపారి విజయ్​ మాల్యా... మరోమారు భారతీయ బ్యాంకుల తీరును తప్పుబట్టారు. ఎన్డీఏ హయాంలో బ్యాంకులు ద్వంద్వనీతిప్రదర్శిస్తున్నాయని దుయ్యబట్టారు.

కర్ణాటక కోర్టుకు సమర్పించిన తన లిక్విడ్ ఆస్తులు అమ్మి... ఆ సొమ్ముతో అర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్​ ఎయిర్​వేస్​ను గట్టెక్కించాలంటూ బ్యాంకులకు చురకలంటించారు.

జెట్ ఎయిర్​వేస్​ను ఆదుకున్న బ్యాంకులు తన కింగ్​ఫిషర్​ ఎయిర్​లైన్స్​ సంస్థను మాత్రం అన్యాయంగా ముంచేశాయని విమర్శించారు మాల్యా. జెట్ ఎయిర్​​వేస్​​ను​ గట్టెక్కించేందుకు సంస్థ యాజమాన్య బాధ్యతలను ఎస్బీఐ తీసుకోవడాన్ని మాల్యా అభినందించారు.

కింగ్​ ఫిషర్​ను కూడా ఇలానే ఆదుకుని ఉంటే బాగుండేదని అయన అన్నారు. ఉత్తమ ఉద్యోగులతో, భారత్​లో అత్యుత్తమ విమాన సంస్థగా ఉన్న కింగ్​ఫిషర్ ఎయిర్​లైన్స్​పై కనికరం చూపలేదని విజయ్​ మాల్యా విమర్శించారు.

"నేను మళ్లీ చెబుతున్నా. రుణదాతలకు అప్పు చెల్లించేందుకు నా లిక్విడ్​ ఆస్తులను కర్ణాటక హైకోర్టు ముందుంచా. బ్యాంకులెందుకు నా వద్ద డబ్బులు తీసుకోవడం లేదు? అ ఆస్తులు జెట్ ఎయిర్​వేస్​​ను ఆదుకోడానికి పనికొస్తాయేమో చూడండి" -ట్విట్టర్​లో విజయ్​ మాల్యా

మాల్యా ట్వీట్​

"కింగ్​ ఫిషర్​ను, సంస్థ ఉద్యోగులను రక్షించేందుకు రూ.4,000 కోట్ల పెట్టుబడి పెట్టాను. నా కృషిని ఎవరూ పట్టించుకోకపోగా, వీలైనంతగా నాపై దాడిచేశారు. కింగ్​ ఫిషర్​ పట్ల ఒకలా, జెట్​ ఎయిర్​వేస్ పట్ల మరోలా వ్యవహరిస్తున్న బ్యాంకులు గొప్పవి. మీడియా కూడా ప్రధానికి లేఖ రాస్తానంటే నా పట్ల అలానే వ్యవహరించింది. ఎన్డీఏ సర్కారు రాగానే అంతగా ఏం మారిందో అర్ధం కావట్లేదు."-మాల్యా

ABOUT THE AUTHOR

...view details