దేశంలో కుటుంబ వ్యాపారాలు వృద్ధి దిశలో ఉన్నాయి. వాటిలో 89 శాతం వ్యాపారాలు వచ్చే రెండేళ్లలో వృద్ధి చెందనున్నట్లు ఓ సర్వే వెల్లడించింది.
"ఫ్యామిలి బిజినెస్ సర్వే 2019" పేరుతో పీడబ్ల్యూసీ సంస్థ 53 దేశాల్లో 2,953 మంది కుటుంబ సారథులు, 106 కుటుంబ వ్యాపారాల అధిపతులపై ఓ సర్వే చేసింది. ఇందులో కుటుంబ వ్యాపారాలు, వాటి పని తీరుపై పలు కీలక అంశాలను వెల్లడించింది.
కుటుంబ వ్యాపారాల్లో 89 శాతం వృద్ధి చెందనున్నాయి. ఇందులో 44 శాతం భారీగా, 45 శాతం ఓ మోస్తరుగా ఎదగొచ్చని పేర్కొంది పీడబ్ల్యూసీ.
వ్యాపారాల విస్తరణకే మొగ్గు...
కుటుంబ వ్యాపారాల్లో ప్రపంచవ్యాప్తంగా సగం కన్నా ఎక్కువ మంది వారి వ్యాపారాలను అంతర్జాతీయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 40 శాతం మంది వ్యాపారాల విస్తరణకు మొగ్గుచూపుతున్నారు.
భారత కుటుంబ వ్యాపారులూ విస్తరణకు, కొత్త మార్కెట్లలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు సగం భారతీయ వ్యాపారాలు ఇతర సంస్థలతో కలిసిపోవడం, లేదా ఇతర సంస్థలను స్వాధీనం చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నాయని సర్వే వెల్లడించింది.
మూల ధనం కోసం