తెలంగాణ

telangana

ETV Bharat / business

జొమాటో: సెప్టెంబర్​లో 10 వేల ఉద్యోగాలు! - ఉద్యోగాలు

జొమాటో లక్షాలాది మంది కడుపు నింపడమే కాదు. జీతమిచ్చి వేలాది మంది జేబులూ నింపుతోంది. జొమాటో ఆహార పంపిణీ సంస్థ వేలల్లో ఉద్యోగాలు కల్పిస్తోంది. కోట్లల్లో లాభాలు ఆర్జిస్తోంది. ఈ సెప్టెంబర్​లో మరిన్ని ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది.

జొమాటో: సెప్టెంబర్​లో 10 వేల ఉద్యోగాలు!

By

Published : Sep 8, 2019, 8:11 PM IST

Updated : Sep 29, 2019, 10:07 PM IST

ఫోన్​లో ఇంటర్​నెట్​ ఉందా.. జొమాటో ఉందా అని చూసే రోజులివి. అవును మరి.. ఉరుకుల పరుగుల జీవితంలో అలసి సొలసిపోయేవారికి వంట చేసే ఓపిక ఉండదు.. రెస్టారెంట్​కు వెళ్లే తీరిక ఉండదు. అలాంటి వారిని పస్తులు ఉంచకుండా కడుపు నింపుతున్నాయి ఫుడ్​ డెలవరీ యాప్​లు.

ఆర్డర్​ కొట్టగానే నిమిషాల్లో ప్రత్యక్షమవుతారు కాబట్టే.. జొమాటోకు ఇంతలా ఆదరణ పెరిగింది. ప్రారంభించిన ఐదేళ్లలోనే పది రెట్ల వృద్ధిని చూస్తోంది, 500 నగరాల్లో విస్తరించింది. జొమాటో కస్టమర్​ రెస్టారెంట్లు నెలకు 200 కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నాయి. ఇప్పుడు కొత్త ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించినట్లు పేర్కొంది ఈ ఫుడ్​ డెలివరీ సంస్థ.

"గత మూడు నెలల్లో నెలకు మా నష్టాలు 50 శాతం తగ్గాయి. గత సంవత్సరంలో ఆరు రెట్లు పెరిగిన ఆహార పంపిణీ వ్యాపారంలో మేము ఇంకా భారీగా పెట్టుబడులు పెడుతున్నాం, ఇప్పుడు 500 కి పైగా నగరాల్లో మా వ్యాపారం ఉంది. మేము ప్రతి వారం 25 మిలియన్ల కస్టమర్లతో కలిసి పని చేస్తాం. 0.5 మిలియన్ ఉద్యోగాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా కల్పిస్తున్నాము. కేవలం సెప్టెంబరులోనే 10,000 కొత్త ఉద్యోగాలను జోడించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం "

- దీపీందర్​ గోయల్, జొమాటో సీఈఓ

ప్రస్తుతం ఈ సంస్థలో ఐదు వేలకు పైగా ఉద్యోగులున్నారు. మార్కెట్​లో జొమాటో 3.6 బిలియన్ డాలర్ల నుంచి 4.5 బిలియన్ డాలర్ల వరకు విలువ చేస్తోంది.

సిలికాన్ వ్యాలీ వెంచర్ ఫండ్ సీక్వోయా క్యాపిటల్, సింగపూర్ ప్రభుత్వ టెమాసెక్ హోల్డింగ్స్ , ఇండియన్ ఈ-కామర్స్ ప్లేయర్ ఇన్ఫో ఎడ్జ్ సహకారంతో మరింత ముందుకు దూసుకెళ్తోంది.

ఇదీ చూడండి:'మోదీ 2.0: వంద రోజుల ప్రజాహిత పాలన'

Last Updated : Sep 29, 2019, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details