తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుస రెండో నెలలోనూ తగ్గిన టోకు ద్రవ్యోల్బణం.. కానీ... - జనవరిలో తగ్గిన టోకు ద్రవ్యోల్భణం

WPI Inflation: టోకు ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలలోనూ దిగివచ్చింది. గతేడాది డిసెంబర్​ 13.56శాతంగా ఉండగా.. జనవరిలో 12.96 శాతానికి తగ్గినట్లు కేంద్రం తెలిపింది.

WPI INFLATION
టోకు ద్రవ్యోల్భణం

By

Published : Feb 14, 2022, 1:25 PM IST

WPI Inflation: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) జనవరిలో తగ్గింది. గతేడాది డిసెంబర్​లో 13.56 శాతం ఉండగా.. జనవరిలో 12.96 శాతంగా నమోదైంది. మరోవైపు ఆహార ధరలు ఎక్కువగానే ఉన్నాయని కేంద్రం తెలిపింది.

గతేడాది ఏప్రిల్​లో రెండు అంకెలు నమోదు చేసిన డబ్ల్యూపీఐ.. నాటి నుంచి అలానే కొనసాగుతూ వస్తోంది. డబ్ల్యూపీఐ రెండంకెలపైన నమోదవడం వరుసగా ఇది పదో నెల కావడం గమనార్హం.

జనవరి 2021లో టోకు ద్రవ్యోల్బణం 2.51 శాతంగా ఉందని కేంద్రం పేర్కొంది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం డిసెంబర్ 2021లో 9.56 శాతంగా ఉండగా.. 2022 జనవరిలో 10.33 శాతానికి పెరిగింది. కూరగాయల ధరల పెరుగుదల డిసెంబర్​ నెలతో పోల్చితే జనవరికి 6.89 శాతం మేర నమోదు చేసింది.

ఇదీ చూడండి:5జీ దిశగా అడుగులు.. మే నెలలో వేలం షురూ..!

ABOUT THE AUTHOR

...view details