తెలంగాణ

telangana

ETV Bharat / business

'సవాళ్లు అధిగమించేందుకు సాధ్యమైనంత సాయం' - పన్నులు

ఆర్థిక వృద్ధి మందగమనానికి మందు వేసేందుకు కేంద్రప్రభుత్వం నడుంబిగించిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ పేర్కొన్నారు. సవాళ్లు ఎదుర్కొంటున్న వివిధ రంగాలకు సాధ్యమైనంత సహాయం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

'సవాళ్లు అధిగమించేందుకు.. సాధ్యమైనంత సాయం'

By

Published : Sep 7, 2019, 5:07 AM IST

Updated : Sep 29, 2019, 5:46 PM IST

దేశ ఆర్థిక వృద్ధి మందగమనానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. దేశంలోని వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత సహకారం అందిస్తుందని కోల్​కతాలో హామీ ఇచ్చారు.

"వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లను మేము పరిశీలిస్తూనే ఉన్నాం. సమస్యల పరిష్కారానికై నిరంతరం వాటితో చర్చలు జరుపుతున్నాం. ఆయా రంగాలకు సాధ్యమైనంత సహాయమూ అందిస్తాం."
- నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థికమంత్రి

ఆర్​బీఐ ఇచ్చిన నిధుల సంగతేంటి?

ఇటీవల ఆర్​బీఐ తన డివిడెండ్​, మిగులు నిల్వల్లోని 1.76 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. అయితే వీటిని ఎలా ఉపయోగించాలనే విషయంలో ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని నిర్మలా సీతారామన్​ వెల్లడించారు.

విజయ దశమి నుంచి..

పన్ను చెల్లింపుదారుల విషయంలో ఫేస్​లెస్​ అసెస్​మెంట్​, ర్యాండమ్ స్క్రూటినీ విధానాన్ని విజయ దశమి నుంచే అమలుచేయనున్నట్లు తెలిపారు నిర్మల.

ఇదీ చూడండి:గగన్​యాన్​: వ్యోమగాముల ఎంపికలో తొలిదశ పూర్తి

Last Updated : Sep 29, 2019, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details