తెలంగాణ

telangana

ETV Bharat / business

వాట్సాప్‌ నిబంధనలు అంగీకరించకుంటే.. - వాట్సాప్

వాట్సాప్​ కొత్త నిబంధనలను అంగీకరించని వారి ఖాతాలను తొలగించబోమని ఆ సంస్థ తెలింది. కానీ వారికి ఆడియో, వీడియో కాల్స్​ సేవలు లభించవని స్పష్టం చేసింది.

WhatsApp
వాట్సాప్‌

By

Published : May 11, 2021, 10:36 PM IST

సరికొత్త గోప్యతా నిబంధనలను ఎవరైనా అంగీకరించకపోతే ఆ ఖాతాను 'డిలీట్‌' చేయమని.. అయితే పరిమిత సేవలే లభ్యమవుతాయని వాట్సప్‌ అంటోంది. అలా అంగీకరించని వినియోగదార్లు చాట్‌ లిస్ట్‌ను యాక్సెస్‌ చేయలేరని.. ఇంకా వాట్సప్‌ ద్వారా వచ్చే ఆడియో, వీడియో కాల్స్‌కు ఆన్సర్‌ చేయలేరని తెలుస్తోంది.

అయితే 'మే 15 కల్లా 'ప్రైవసీ పాలసీ అప్‌డేట్‌'ను అంగీకరించని వారి ఖాతాను డిలీట్‌ చేయమని, సేవలూ కొనసాగుతాయ’ని గత వారం ఈ కంపెనీ తెలిపింది. కాగా, ఈ నిబంధనలను అంగీకరించని వారికి 'రిమైండర్లు' పంపడం కొనసాగిస్తామని..అది అంగీకరించేంత వరకు పరిమిత సేవలే లభ్యమవుతాయని తాజాగా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే ఎంత కాలం వరకు రిమైండర్లు పంపుతారనేది వెల్లడించలేదు. పరిమిత సేవలు కొన్ని వారాల పాటు ఇచ్చాక కూడా 'అంగీకారం' తెలపకపోతే మెసేజ్‌లు, కాల్స్‌ను నిలిపివేస్తామని తెలిపింది.

ఇదీ చదవండి:మీ పాత మొబైల్‌ నంబర్​ వేరొకరికి ఇస్తే..

ABOUT THE AUTHOR

...view details