ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల మధ్య ఛాట్లు సులువుగా బదిలీ(ఛాట్ మైగ్రేషన్) చేసేందుకు వీలుగా సరికొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి వాట్సాప్ ఇటీవలే ప్రయత్నాలు ప్రారంభించింది. కొత్త ఓఎస్‌తో పాటు.. కొత్త ఫోన్ నంబర్‌కూ ఛాటింగ్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయం ఈ ఫీచర్లో ఉండనున్నట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో అనే టెక్ న్యూస్ సంస్థ పేర్కొంది.
కొత్త ఫీచర్ విశేషాలు..
ప్రస్తుతానికి వాట్సాప్‌లో ఒకే ప్లాట్ ఫామ్‌లో(ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్‌కు లేదా ఐఓఎస్ నుంచి ఐఓఎస్‌కు) ఛాట్ హిస్టరీని బదిలీ చేయడం చాలా సులభం. అయితే ఇటీవల చాలా మంది ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్‌కు లేదా ఐఓఎస్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారుతుండటం సాధారణమైంది. ఈ నేపథ్యంలో క్రాస్ ఓఎస్ ప్లాట్‌ఫామ్ ఛాట్ ట్రాన్స్ఫర్ ఫీచర్ తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారభించింది వాట్సాప్.
అయితే ఈ సదుపాయం కొత్త ప్లాట్ ఫామ్‌పై వాట్సాప్ అకౌంట్‌కు లాగిన్ అయ్యే సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని సమాచారం. ఈ కొత్త ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి రానుంది అనే వివరాలు మాత్రం వాట్సాప్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఇదీ చూడండి:కొత్త ప్రైవసీ పాలసీలపై వాట్సాప్‌కు కేంద్రం వార్నింగ్!