తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఫోన్​ అప్​డేట్​ చేయకపోతే తప్పదు భారీ మూల్యం' - Indian computer emergency response team

ఆండ్రాయిడ్​ ఫోన్​ అప్​డేట్​ చేయకపోతే మీ రహస్య సమాచారమంతా సైబర్​ నేరగాళ్ల చేతికి చిక్కినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని నివారించేందుకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన 'ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్ ఇండియా‌) మార్గదర్శకాలను జారీ చేసింది.

Warning for Android users in India CERT In issues advisory
మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ పాత వెర్షన్‌లోనే ఉందా.. అయితే జాగ్రత్త!

By

Published : Jun 2, 2020, 6:05 AM IST

Updated : Jun 3, 2020, 5:16 PM IST

భారత్‌లో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వాడుతున్న వారు సైబర్‌ నేరగాళ్ల బారిన పడే ప్రమాదముందని సాంకేతిక నిపుణులు హెచ్చరించారు. జాగ్రత్త పడకుంటే వీరి వ్యక్తిగత సమాచారం అవాంఛనీయ వ్యక్తుల చేతికి చిక్కేందుకు అధిక అవకాశాలున్నాయని వారు తెలిపారు. దీనిని నివారించేందుకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన 'ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్ ఇండియా‌) మార్గదర్శకాలను జారీ చేసింది. తమ ఫోన్లలో ఇంకా పాత ఓఎస్‌ వాడుతున్న వారు ప్రమాదం అంచున ఉన్నట్టు సెర్ట్‌ తెలిపింది. గూగుల్‌ ఆండ్రాయిడ్‌లో స్టాండ్‌హాగ్‌ 2.0 అనే బగ్ ఉన్నట్టు కనుగొన్నామని.. దీని బారిన పడిన ఫోన్లలోని ఏ యాప్‌నైనా హ్యాకర్లు హైజాక్‌ చేయవచ్చంటూ సెర్ట్‌ తెలిపింది. సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం... ఆండ్రాయిడ్‌ 10 లేదా ఆపై వెర్షన్లకు అప్‌డేట్‌ కాని ఫోన్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతమయ్యేందుకు అనేక అవకాశాలున్నాయి.

ఏం చేయాలి?

ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ను ఉపయోగించే వారందరూ తమ ఫోన్లలో అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఇందుకు గాను, ఫోన్లో ఉండే 'సెట్టింగ్స్‌'లోకి వెళ్లి దానిలోని 'సిస్టమ్‌ అప్‌డేట్‌' అనే ఆప్షన్‌ను తెరవాలి. దానిలో అప్‌డేట్‌పై ఏదైనా సూచన కనిపిస్తే... వెంటనే తమ ఫోన్‌ను లేటెస్ట్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలి. కాగా, ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ఇంచుమించు అన్ని ఫోన్లు ఆండ్రాయిడ్‌ 10ని సపోర్ట్‌ చేస్తాయని... వినియోగదారులు వాటిని అప్‌డేట్‌ చేసుకోవాలని నిపుణులు కోరారు. పేరొందిన, నమ్మదగిన అప్లికేషన్‌ ప్రొవైడర్ల ద్వారా మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని... అదే విధంగా, ఇమెయిల్‌, మెసేజ్‌ల ద్వారా వచ్చే లింక్‌లను, వెబ్‌సైట్లను విచక్షణా రహితంగా తెరవద్దని సెర్ట్‌ మరోసారి హెచ్చరించింది.

ఇదీ చూడండి:ఫ్లిప్​కార్ట్ ఫుడ్​​ రిటైల్ బిజ్ ప్లాన్స్​కు కేంద్రం బ్రేక్​

Last Updated : Jun 3, 2020, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details