ప్రపంచ విమానయాన పరిశ్రమపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విమానయాన సంస్థల ఆదాయం 63 బిలియన్ డాలర్ల నుంచి 113 బిలియన్ డాలర్ల మేర కోల్పోయే ప్రమాదం ఉందని పరిశ్రమల విభాగం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) హెచ్చరించింది.
ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల ద్వారా వచ్చే ఆదాయం 19 శాతం మేర తగ్గుతుందని ఐఏటీఏ అంచనా వేసింది. ఈ మొత్తం.. ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో విమానయాన రంగం చూసిన నష్టంతో సమానమని పేర్కొంది.