కరోనా సెకండ్ వేవ్ గ్రామాలను చుట్టేస్తున్నట్లు భారతీయ స్టేట్ బ్యాంక్ అధ్యయనంలో తేలింది. దేశంలో రోజూ నమోదయ్యే కేసుల్లో సగం.. గ్రామీణ ప్రాంతాల నుంచేనని స్పష్టమైంది. అందరికీ టీకా ఇవ్వటం ఒక్కటే దేశం ముందున్న పరిష్కారమని ఎస్బీఐ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్యా కాంతి ఘోష్ తెలిపారు.
మార్చిలో టాప్ 15 జిల్లాల్లో కొవిడ్ వ్యాప్తి రేటు 55 శాతంగా ఉంటే.. మే లో 26.3 కు చేరిందని.. దీని అర్థం గ్రామాల్లో వైరస్ వ్యాప్తి అధికమైందని ఎస్బీఐ నివేదిక స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ వ్యాప్తి మార్చిలో 36.8 శాతంగా ఉంటే.. మే లో 48.5 శాతానికి చేరిందని వివరించింది.
ఆ జిల్లాల్లోనే అధికం
కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న టాప్ 15 గ్రామీణ జిల్లాలు..
వేగం లేని వ్యాక్సినేషన్
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగటం లేదని సౌమ్యా కాంతి ఘోష్ తెలిపారు.
- దేశంలో ఇప్పటివరకు అందిన డోసులు 16.5 కోట్లు
- మొదటి డోసు తీసుకున్నవారు- 13.1 కోట్లు
- రెండో డోసు తీసుకున్నవారు - 3.5 కోట్లు
- మొత్తం డోసులతో పోల్చితే దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు - 19.5 శాతం కంటే తక్కువే.
- ఏప్రిల్లో రోజువారీ వ్యాక్సినేషన్ సరాసరి 28 లక్షల మంది అందిస్తే.. మే లో ఆ సంఖ్య 17 లక్షలుగా ఉంది.
- దేశంలో కరోనా రెండో దశ విజృంభణ దృష్ట్యా దాదాపు 20 రాష్ట్రాల్లో లాక్డౌన్ వివిధ దశల్లో ఉంది.
'అప్పుడే హెర్డ్ ఇమ్యూనిటీ'
"వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇలానే కొనసాగిస్తే.. అక్టోబర్ నాటికి 15 శాతం మందికే టీకా అందుతుంది. సెప్టెంబర్, అక్టోబర్లో రోజుకు 55లక్షల మందికి టీకాలు అందిస్తేనే అక్టోబరు నాటికి హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం.
కొవిడ్ కారణంగా.. ఎస్బీఐ బిజినెస్ ఇండెక్స్ క్రమంగా తగ్గిపోయింది" అని ఎస్బీఐ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్యా కాంతి ఘోష్ తెలిపారు. ఇలానే కొనసాగితే.. జీడీపీ వృద్ధి రేటు 10.4 శాతానికి చేరుకోవటం కష్టమని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి :71 శాతం కేసులు ఆ పది రాష్ట్రాల్లోనే: కేంద్రం