ఇటీవల తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీని ఆమోదించకపోయినప్పటికీ.. ఏ ఒక్క ఖాతాను వాట్సాప్ తొలగించదు. కానీ, వివాదాస్పదంగా మారిన పాలసీకి అంగీకారం తెలపకపోతే.. కొన్ని వారాల తర్వాత వారి చాట్ జాబితాను పొందలేరు. కనీసం వాట్సాప్‌పై ఇన్కమింగ్, వీడియో కాల్‌కు సమాధానం ఇవ్వలేరు.
ప్రైవసీ పాలసీ నవీకరణకు విధించిన మే 15 గడవు లోపు ఆమోదం తెలపని వినియోగదారులు ఖాతాల తొలగింపు, నిలిపివేయటం వంటివి ఎదుర్కోరని వాట్సాప్ గతవారమే తెలిపింది. ఎవరైతే అంగీకరించలేదో వారిని అలర్ట్ చేస్తున్నామని, కొన్ని వారాల తర్వాత ప్రజలకు అందే రిమైండర్లూ నిరంతరం మారుతాయని తన వెబ్సైట్లో పేర్కొంది. కొత్త విధానాన్ని ఆమోదించే వరకు పరిమితంగానే వాట్సాప్ పొందుతారని తెలిపింది.
అందరికి ఒకేసారి కాదు..
అందరు వినియోగదారులకు ఒకేసారి ఆంక్షలు ఉండబోవు. కొందరు చాట్ లిస్ట్ పొందకపోయినప్పటికీ.. సాధారణ, వీడియో కాల్స్‌ను పొందుతారని పేర్కొంది వాట్సాప్. నోటిఫికేషన్ ఉన్నట్లయితే.. వాటిపై క్లిక్ చేసి సందేశాలకు సమాధానం ఇవ్వొచ్చని తెలిపింది. ఇలా కొన్ని వారాలు కొనసాగిన తర్వాత అప్పటికీ ఆమోదం తెలపకపోతే.. అప్పుడు కాల్స్, సందేశాలు ఆగిపోతాయని తెలిపింది.
ఖాతా తొలగింపు ఉండదు..