తెలంగాణ

telangana

ETV Bharat / business

మూడేళ్లలో 7 ట్రిలియన్​ డాలర్లకు డిజిటల్ చెల్లింపులు! - బ్యాంకింగ్​పై కరోనా ప్రభావం

కరోనా నేపథ్యంలో నగదు చెల్లింపుల్లో డిజిటల్ లేదా కార్డుల వినియోగం భారీగా పెరుగుతుందని ఓ నివేదిక వెల్లడించింది. 2023 నాటికి 7 ట్రిలియన్ డాలర్లు, 2030 నాటికి 48 ట్రిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు.. డిజిటల్ రూపంలోనే జరుగుతాయని అంచనా వేసింది.

digital payments
డిజిటల్ పేమెంట్స్

By

Published : Nov 24, 2020, 5:41 PM IST

మూడేళ్ల కాలంలో నగదు చెల్లింపుల్లో భారీ మార్పులు జరుగుతాయని యాక్సెంచర్​ నివేదిక వెల్లడించింది. 2023 కల్లా 270.7 బిలియన్ డాలర్ల విలువైన 6,600 కోట్ల లావాదేవీలు కార్డులు, డిజిటల్ రూపంలోకి మారుతాయని తెలిపింది.

"ప్లేయింగ్ ది లాంగ్ గేమ్ ఇన్ పేమెంట్స్ మోడర్నైజేషన్" పేరుతో ఈ నివేదికను యాక్సెంచర్ విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో బ్యాంకుల వ్యవస్థను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని యాక్సెంచర్ తెలిపింది. అందువల్ల డిజిటల్​ పేమెంట్స్ భారీగా పెరుగుతున్నాయని స్పష్టం చేసింది.

2023 నాటికి డిజిటల్ రూపంలో మొత్తం 7 ట్రిలియన్ డాలర్ల విలువైన 42 వేల లావాదేవీలు జరుగుతాయని యాక్సెంచర్ అంచనా వేసింది. 2030 నాటికి ఆ లావాదేవీలు 48 ట్రిలియన్ల డాలర్లకు పెరుగుతాయని తెలిపింది.

ఇదీ చూడండి:ఐదేళ్లలో గణనీయంగా పెరిగిన డిజిటల్ చెల్లింపులు

ABOUT THE AUTHOR

...view details