ప్రపంచ బ్యాంకు 13వ అధ్యక్షుడిగా 63 ఏళ్ల డేవిడ్ మల్పాస్ను బ్యాంకు కార్యనిర్వహణ బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ నెల 9వ తేదీన ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఐదు సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. డేవిడ్ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అంతర్జాతీయ వ్యవహారాల ట్రెజరీ విభాగంలో సీనియర్ అధికారిగా ఉన్నారు. ప్రపంచ బ్యాంకు క్రితం అధ్యక్షులంతా అమెరికాకు చెందిన వారే.
జీ7, జీ20 ఆర్థిక మంత్రుల సదస్సు, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలతో పాటు ఇతర ముఖ్యమైన కార్యక్రమాలకు గతంలో డేవిడ్ అమెరికా తరపున ప్రాతినిధ్యం వహించారు.