తెలంగాణ

telangana

ETV Bharat / business

పావుశాతం వడ్డీరేటు తగ్గించిన ఫెడరల్ రిజర్వ్​ - ఆర్థికవ్యవస్థ

అంచనాలు నిజంచేస్తూ అమెరికా ఫెడరల్​ రిజర్వ్​ కీలక వడ్డీ రేటును 25 శాతం తగ్గించింది. ఫలితంగా వడ్డీ రేటు శ్రేణి 2.0 - 2.25 శాతానికి దిగొచ్చింది.

పావుశాతం వడ్డీరేటు తగ్గించిన ఫెడరల్ రిజర్వ్​

By

Published : Aug 1, 2019, 11:00 AM IST

అమెరికా ఫెడరల్​ రిజర్వ్​ అంచనాలకు అనుగుణంగానే కీలక వడ్డీ రేటును పావు శాతం మేర తగ్గించింది. ఫలితంగా వడ్డీరేటు శ్రేణి 2.0 - 2.25 శాతం స్థాయికి దిగివచ్చింది. 2008 ఆర్థిక సంక్షోభం తరువాత ఫెడరల్ రిజర్వ్​ వడ్డీ రేట్లను తగ్గించడం ఇదే మొదటిసారి.

అంతర్జాతీయంగా అనిశ్చితి, ద్రవ్యోల్బణం నిర్దేశించుకున్న స్థాయి కంటే 2 శాతం దిగువనే ఉండటం తదితర అంశాలను ఫెడరల్​ రిజర్వ్​ పరిగణనలోకి తీసుకుంది. వీటిని దృష్టిలో ఉంచుకునే వడ్డీ రేట్లను తగ్గించినట్లు ఫెడరల్​ ఓపెన్​ మార్కెట్​ కమిటీ (ఎఫ్​వోఎంసీ) తెలిపింది.

ఆర్థికమాంద్యం లేకుండా, ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉన్న సమయంలో ఇలా వడ్డీరేట్లను తగ్గించడం 1998 తరువాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా వడ్డీ రేట్లను అరశాతం వరకైనా తగ్గించాలని ఫెడ్​ రిజర్వ్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ​ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ రేట్ల కోతను 25 శాతానికే పరిమితం చేసింది.

చైనా వృద్ధి మందగించడం, బ్రెగ్జిట్​ సమస్యతో ఐరోపా సమాఖ్య ఉండటం, అమెరికాలో వ్యాపార పెట్టుబడులు తగ్గడం, కార్పొరేట్ రుణ స్థాయిలు పెరిగిన నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేటు తగ్గించడం సరైన చర్యగా కొంత మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: సిద్ధార్థ సేవలు కొనియాడిన పారిశ్రామిక దిగ్గజాలు

ABOUT THE AUTHOR

...view details