తెలంగాణ

telangana

By

Published : May 12, 2021, 3:43 PM IST

ETV Bharat / business

2021లో ప్రపంచార్థికం భళా- భారత్ డీలా!

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది భారత వృద్ధి రేటు 7.5 శాతానికి పరిమితమవ్వచ్చని ఐరాస అంచనా వేసింది. ఇదే సమయంలో ప్రపంచ వృద్ధి రేటు 5.4 శాతానికి రికవరీ కావచ్చని పేర్కొంది. చైనా జీడీపీ ఏకంగా 8.2 శాతం పెరగొచ్చని వెల్లడించింది.

Forecast on India Economy
వృద్ధి రేటుపై అంచనాలు

ఈ ఏడాది భారత్​ 7.5 శాతం వృద్ధి రేటును నమోదు చేయొచ్చని ఐరాస అంచనా వేసింది. 2022లో ఇది 10.5 శాతానికి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్థిక వ్యవస్థపై కరోనా రెండో దశ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది పెట్టుబడుల వృద్ధి ఏకంగా 10.2 శాతం తగ్గొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులపై విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలు పేర్కొంది ఐరాస.

ప్రపంచ వృద్ధిపై అంచనాలు ఇలా..

ప్రపంచార్థికం ఈ ఏడాది 5.4 శాతం వృద్ధి రేటును నమోదు చేయొచ్చని ఐరాస అంచనా వేసింది. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలో కరోనా వ్యాక్సినేషన్​ వేగంగా సాగుతుంటం వల్ల ప్రపంచార్థికం రికవరీ ఈ స్థాయిలో సాధ్యమవచ్చని పేర్కొంది.

చైనా, అమెరికా వృద్ధి రేటు ఈ ఏడాది వరుసగా 8.2 శాతం, 6.2 శాతంగా నమోదయ్యే అవకాశముందని ఐరాస పేర్కొంది. 1984 తర్వాత ఇదే అత్యధికం కావచ్చని వివరించింది.

దక్షిణాసియా వృద్ధి రేటు 2021లో 6.9 శాతానికి రికవరీ కావచ్చని అంచనా వేసింది ఐరాస. 2020లో ఈ ప్రాంత వృద్ధి రేటు 5.6 శాతం క్షిణించినట్లు గుర్తు చేసింది.

ఇదీ చదవండి:కార్లకు కరోనా సెగ- ఏప్రిల్​లో విక్రయాలు డీలా!

ABOUT THE AUTHOR

...view details