మీడియా రంగ ప్రముఖుడు ఉదయ్ శంకర్ పరిశ్రమల సమాఖ్య 'ఫిక్కీ' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2020-21కి గాను ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఉదయ్ శంకర్ ప్రస్తుతం వాల్ట్ డిస్నీ ఆసియా పసిఫిక్ ప్రాంత అధ్యక్షుడిగా, స్టార్&డిస్నీ ఇండియా ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 31న ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు ఉదయ్ శంకర్.
సోమవారమే హిందుస్థాన్ యునీలీవర్ ఛైర్మన్, ఎండీ సంజీవ్ మెహతా.. ఫిక్కీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా ఇండియన్ మెటల్స్&ఫెర్రో అల్లోయిస్ ఎండీ సుబ్రకాంత్ పాండా వ్యవహరించనున్నారు.
ఇప్పటి వరకు ఫిక్కీ అధ్యక్షురాలిగా వ్యవహరించిన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎండీ సంగీతా రెడ్డి.. ఉదయ్ శంకర్ సహా, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి:భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు