Types of Debt:మన ఆకాంక్షలు సాకారం చేసుకోవడంలో, అనేక జీవిత లక్ష్యాలను సాధించడంలో రుణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ అదే సమయంలో కొన్ని అప్పులు అనవసరమైన ఒత్తిడికి దారితీసే బాధ్యతగా మారతాయి. అందువల్ల, ఆర్ధిక నిర్ణయాలు తీసుకోవాలనుకునే ఎవరైనా అవసరమైన రుణం, అనవసరమైన రుణం మధ్య తేడాను అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. మెల్లగా తగ్గుముఖం పట్టి కొన్ని సందర్భాల్లో కాలక్రమేణా పెరిగే ఆస్తులను కొనుగోలు చేయడానికి రుణం తీసుకుంటే.. దానిని అవసరమైన రుణం అంటారు.
Good debt vs Bad debt
మంచి ఆర్ధిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, స్థిరమైన, సురక్షితమైన భవిష్యత్తును నిర్ధారించడానికి పొదుపు, రుణాలు, పెట్టుబడులను ప్లాన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒకరు విద్యకు రుణం తీసుకుంటే అది లాభదాయకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అది భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది. విద్య ద్వారా మంచి భవిష్యత్తు ఏర్పడడమే కాకుండా ఆర్ధిక భరోసాకు బలమైన సాధనం మన చేతిలో ఎల్లప్పుడు ఉంటుంది.
అయితే, వీలైనంత వరకు భారీ అప్పులకు దూరంగా ఉండాలి. అదే విధంగా, మంచి ఆరోగ్య బీమా కోసం రుణాలు తీసుకోవడం అవసరమైన రుణం కిందకు వస్తుంది. ఎందుకంటే ఇది ఊహించని భవిష్యత్ ప్రమాదాల నుండి రక్షిస్తుంది. అలాగే ఏదైనా వ్యాపారంలో తగినంత అనుభవం ఉంటే.. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి రుణం తీసుకోవడం అవసర రుణంగా పరిగణించబడుతుంది. ఇందులో రిస్క్‌లు ఉన్నాయని ఎటువంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదు. వ్యాపార, వ్యవహార బాధ్యతలు పెరుగుతాయి అంతే. ఇటువంటి రుణం అవసరమైన ఆరోగ్యకరమైన ఎంపికగా పరిగణిస్తారు. సురక్షితమైన భవిష్యత్తు, అధిక రాబడి కోసం, మన ఆర్ధిక ప్రణాళికను మెరుగుపరచుకోవడం కోసం రిస్క్‌ని అంచనా వేసి అవసరమైన వ్యాపార రుణాన్ని పొందాలి.
Unnecessary debt example
ఒక వ్యక్తి ఆర్ధిక శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపే రుణాన్ని అనవసర రుణం అంటారు. ఒక ఖరీదైన ఆటోమోబైల్ (టూ వీలర్, ఫోర్ వీలర్)ను కొనుగోలు చేయడానికి తీసుకునే రుణం అనవసరమైనదిగా ఎలా మారుతుందంటే.. ఈఎమ్ఐ మొత్తం వినియోగదారు నెలవారీ ఆదాయం, వార్షిక ఆదాయం కంటే అసమానంగా ఎక్కువగా ఉంటే అనవసర రుణంగా భావిస్తారు. అధిక వడ్డీ రేటు విధించబడే రుణాన్ని కూడా అనవసర రుణం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది రుణగ్రహీతపై గణనీయమైన వడ్డీ భారాన్ని మోపుతుంది. చాలా మంది వ్యక్తులు వడ్డీ రేటు కంటే మెరుగైన రాబడిని ఆశించే ప్రదేశాలలో పెట్టుబడి పెట్టడానికి రుణం తీసుకుంటారు. కానీ ఇది సరైన నిర్ణయం కావచ్చు లేదా కాకపోవచ్చు.
దీర్ఘకాలిక వృద్ధిని అందించని ఒకరి వ్యక్తిగత వినియోగం కోసం సేవలు, ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి డబ్బును రుణంగా తీసుకోవడం అనవసర రుణంగా పరిగణిస్తారు. క్రెడిట్ కార్డ్‌పై ఏటీఎంలో డబ్బును ఉపసంహరించుకోవడం లాంటివి కూడా అనవసర రుణంగా చూస్తారు. ఎందుకంటే దీనిపై వీపరీత వడ్డీలు క్రెడిట్ కార్డ్ సంస్థలు వసూలు చేస్తాయి. అలాగే సర్వీస్, కస్టమర్ ఛార్జీలు లాంటివి ఈ రుణాలపై వసూలు చేస్తారు. అందుచేత ఇలాంటి అధిక వడ్డీ రేట్లకు గురిచేసే స్వల్పకాల రుణాలను నివారించడం మంచిది.
Good debt example
రుణం సందర్భోచితమైనది, నిర్దిష్టమైన అవసరాలను తీర్చగలిగేదిగా ఉండాలి. అయితే, ఒకరి ఆర్ధిక పరిస్థితిని బట్టి ఒకరికి అవసరమైన అప్పు మరొకరికి అనవసరంగా ఉంటుంది. అవసరమైన రుణం తప్పనిసరిగా ఆర్ధిక స్వేచ్ఛను పొందేందుకు, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి. ఏదైనా రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందు, ఆ రుణం ఫలవంతమైన ఫలితాలను ఇస్తుందా, బాధ్యతగా మారుతుందా అని విశ్లేసించుకోవాలి. మీ ప్రస్తుత ఆర్ధిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా అంచనా వేయడం, ప్రస్తుత రుణం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఎలా అందజేస్తుందో అంచనా వేయడం ముఖ్యం.
ఇదీ చదవండి: