Twitter Tips And Tricks: స్మార్ట్‌ఫోన్స్ వచ్చాక ఎన్నో రకాల అప్లికేషన్లు డౌన్‌లోడ్ చేసుకొని వాడేస్తున్నాం. మొబైల్ గేమ్స్ నుంచి సోషల్ నెట్‌వర్కింగ్ యాప్స్ వరకు అన్నీ.. అవసరం లేకున్నా ఫోన్‌లో అలా ఇన్‌స్టాల్ చేసేస్తాం. కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్‌కు గురవుతూవుంటాయి. మన ప్రమేయం లేకుండానే మన వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఇబ్బందికర పోస్టింగ్‌లు ప్రత్యక్షమవుతాయి.
ఈ టిప్స్ పాటిస్తే.. మీ ట్విట్టర్ ఖాతా సేఫ్! - ట్విట్టర్ ఖాతా
Twitter Tips And Tricks: మొబైల్ గేమ్స్ నుంచి సోషల్ నెట్‌వర్కింగ్ యాప్స్ వరకు ఎన్నో యాప్స్‌ను మన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని వాడేస్తున్నాం. అయితే.. కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్‌కు గురవుతుంటాయి. మరి వీటికి చెక్ పెట్టడం ఎలా..?
ట్విట్టర్
ఈరోజు తెల్లవారుజామున ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా కూడా హ్యాక్ అవడమే ఇందుకు ఉదాహరణ. ఈనేపథ్యంలో మన ట్విట్టర్ అకౌంట్ భద్రంగా ఉందో లేదో ఓసారి చూద్దాం. హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. కుదిరితే వాటిని పాటిద్దాం..
- ఇతర వెబ్‌సైట్లకు ఉపయోగించని స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను మీ ట్విట్టర్ అకౌంట్‌కు పెట్టాలి.
- టూ-ఫాక్టర్ అథెంటికేషన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. అంటే ఈ-మెయిల్ లేదా మొబైల్‌కు వెరిఫికేషన్ కోడ్ వచ్చేలా సెట్ చేసుకోవడం.
- ట్విట్టర్ అకౌంట్‌కు మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అనుసంధానించాలి. ఎప్పుడైనా అకౌంట్ పాస్‌వర్డ్ రీసెట్ చేయటానికి ఉపయోగపడుతుంది. హ్యాకర్స్ రీసెట్ పాస్‌వర్డ్ ద్వారా మీ అకౌంట్‌ను హ్యాక్ చేయటానికి ప్రయత్నించినా.. మీ మొబైల్, ఈ-మెయిల్‌కు అలర్ట్ మెసేజ్ పంపి ట్విటర్ మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది.
- ట్విట్టర్ అని గూగుల్ సెర్చ్ చేస్తే ఒరిజినల్ వెబ్‌సైట్‌కు బదులు కొన్నిసార్లు నకిలీ వెబ్‌సైట్లు వస్తుంటాయి. వాటి నుంచి లాగిన్ అయితే ఇక మన పని అంతే.. ట్విట్టర్.కమ్ నుంచే లాగిన్ అవుతున్నారో లేదో చెక్ చేసుకొంది. మన లాగిన్ సమాచారాన్ని దొంగలించటానికి ఇతర డూప్లికేట్ లింక్స్‌ని గూగుల్‌లో సెర్చ్‌లో హ్యాకర్స్ అందుబాటులో ఉంచుతుంటారు.
- ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులెవరికీ మీ అకౌంట్ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను ఇవ్వొద్దు.
- మీ కంప్యూటర్‌లోని సాఫ్ట్‌వేర్‌లు, మొబైల్ అప్లికేషన్లు, బ్రౌజర్లు, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లో ఉండేలా చూసుకోండి.
- అకౌంట్ వెరిఫికేషన్‌కు లేదంటే ఇతర అవసరాల కోసం ఈ-మెయిల్, మెసేజ్ ద్వారా ట్విట్టర్ తన యూజర్లను అకౌంట్ పాస్‌వర్డ్‌లను ఇవ్వమని అడగదు. ఇది ప్రతిఒక్కరు గుర్తుంచుకోవాలి.
- మీకు తెలియకుండా మీ ఈ-మెయిల్ అడ్రస్‌ను ఎవరన్నా అప్‌డేట్ చేసినా.. మీ పాత ఈ-మెయిల్‌కు ట్విట్టర్ నోటిఫికేషన్ పంపుతుంది. తద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. మీరు మార్చకపోతే వెంటనే ఆ అప్‌డేట్‌ను క్యాన్సిల్ చేసే వెసులుబాటును ట్విట్టర్ కల్పిస్తుంది.
- లాగిన్ యాక్టివిటీని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. మీ మొబైల్ ఫోన్ నుంచి కాకుండా వేరే ఫోన్ల నుంచి మీరు లాగిన్ అయినట్టు చూపిస్తుంటే.. వెంటనే ఆ డివైజ్ నుంచి లాగ్‌అవుట్ అవ్వండి. ఇంకా అనుమానంగా ఉంటే వెంటనే పాస్‌వర్డ్‌ను మార్చేయండి.
- ట్వీట్స్‌ను ఈజీగా షేర్ చేయడానికి కొంత మంది షార్టన్ లింక్స్ వాడుతుంటారు. ఆ లింక్స్ ఏ డొమైన్‌కు వెళ్తుందో చెప్పలేం. కాబట్టి అలాంటి లింక్స్ ఓపెన్ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. అవసరమనుకుంటేనే వాటి జోలికి వెళ్లండి.. లేదంటే వదిలేయటం ఉత్తమం.