మనం ఓ బైక్ కొనగోలు చేస్తాం. కానీ, దాని రంగు, దాని మీద ఉండే గ్రాఫిక్స్.. అలా కాకుండా వేరేలా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అయినా.. దాన్ని మనం మార్చుకోలేం. మరి మన బైక్ మనకు నచ్చినట్టుగా ముందే డిజైన్ చేసి ఉంటే ఎంతో బాగుంటుంది కదా? ఇదే ఆలోచనతో ముందుకొచ్చింది ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ. వినియోగదారుడికి నచ్చినట్టుగా తమ వాహనాలను ముందే డిజైన్ చేసేలా.. 'బిల్ట్-టు-ఆర్డర్'(Built-to-order platform) వేదికను తీసుకువచ్చినట్లు మంగళవారం ప్రకటించింది.
ఈ వేదిక ద్వారా వినియోగదారులు తమకు అనుకూలంగా ఉండే బైకులను కొనుగోలు చేయవచ్చని టీవీఎస్ మోటార్ సంస్థ తెలిపింది. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైకుల కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా వినియోగాదారులు ప్రీసెట్ కిట్లను, గ్రాఫిక్స్, రిమ్ రంగులు, పర్సనలైజ్డ్ రేస్ నంబర్లను తమకు కావాల్సినవి ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొంది.