తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్రాయ్​ కొత్త యాప్​తో ఛానెళ్ల ఎంపిక ఈజీ! - ట్రాయ్ సెలెక్టర్ యాప్​తో ఛానెళ్ల ఎంపిక

కేబుల్​, డీటీహెచ్ ఆపరేటర్లు ఇచ్చే ప్లాన్​లు కాకుండా మీకు నచ్చిన ఛానెళ్లను మాత్రమే చూసేందుకు వీలుగా 'ట్రాయ్' ఛానెల్ సెలక్ట్ యాప్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ విశేషాలు.. ఇతర ఉపయోగాలు వివరంగా మీ కోసం.

channel selector app
ఛానెల్ సెలెక్టర్​ యాప్​

By

Published : Jun 25, 2020, 6:03 PM IST

టీవీ ఛానెళ్ల ఎంపికలో డీటీహెచ్​, కేబుల్ నెట్​వర్క్​ వినియోగదారులకు మరిన్ని వెసులుబాట్లు కల్పించింది టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్​). వినియోగదారులకు నచ్చిన ఛానెళ్లను ఎంపిక చేసుకునేందుకు వీలుగా.. 'ఛానెల్ సెలెక్టర్' అనే మొబైల్ యాప్​ను ఆవిష్కరించింది. దీని ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన ఛానెళ్లు మాత్రమే ఎంపిక చేసుకుని చూసేందుకు వీలు కలగనుంది.

వినియోగదారులకు వారు చూడని ఛానెళ్లకు అనవసరంగా డబ్బులు చెల్లించకుండా ఈ యాప్​ ఉపయోగపడుతుందని ట్రాయ్ పేర్కొంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

  • గూగుల్ ప్లే స్టోర్, యాపిల్​ ఐ స్టోర్​ నుంచి ఈ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవచ్చు.
  • 'సెట్​ టాప్​ బాక్స్' నంబర్​ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​తో యాప్​లోకి లాగ్​​ఇన్​ అవ్వాల్సి ఉంటుంది.
  • టీవీ స్క్రీన్​పై కనిపించే ఓటీపీని నమోదు చేయడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

యాప్​లో ఉండే ఫీచర్లు..

ఛానెల్ సెలెక్టర్​ యాప్​ ద్వారా.. ఛానెళ్ల ఎంపికతో పాటు వాటి వ్యాలిడిటీ, నెలవారీ చందా వంటి వివరాలు పొందొచ్చు. వినియోగదారుల ప్రస్తుత ప్లాన్​లు, గడువు ముగింపు వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు.

ఇప్పటికే దాదాపు అన్ని డీజీహెచ్​, కేబుల్ ఆపరేటర్లను ఈ యాప్​తో అనుసంధానించినట్లు 'ట్రాయ్' వెల్లడించింది. త్వరలోనే ఇతర ఆపరేటర్లను ఈ యాప్​తో అనుసంధానిస్తామని పేర్కొంది.

యాప్​ డేటా సురక్షితం!

ఈ యాప్​ వాడే వినియోగదారుల డేటాను సేకరించబోమని ట్రాయ్ ఛైర్​పర్సన్ ఆర్.ఎస్​. శర్మ వెల్లడించారు. వినియోగదారుల నుంచి తీసుకున్న ప్రాథమిక వివరాల డేటానూ వారి మొబైళ్లలోనే భద్రపరుస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:దిగొచ్చిన బంగారం ధర- పసిడి బాటలోనే వెండి

ABOUT THE AUTHOR

...view details