తెలంగాణ

telangana

ETV Bharat / business

48 మంది బిలియనీర్లతో టాప్​-10లోకి ముంబయి - ఫోర్బ్స్ మ్యాగజీన్

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనిక నగరాలపై సర్వే చేపట్టింది పోర్బ్స్​. ఆయా నగరాల్లోని ప్రపంచ బిలియనీర్ల జాబితాను ప్రకటించింది. ప్రపంచంలోని టాప్-10 నగరాల్లో భారత్​లోని ముంబయి 48 మంది బిలియనీర్లతో చోటు దక్కించుకుంది.

Top 10 cities in the world with most billionaires
టాప్​-10 నగరాల్లోని బిలియనీర్ల జాబితాను ప్రకటించిన ఫోర్బ్స్

By

Published : Apr 11, 2021, 11:09 AM IST

Updated : Apr 11, 2021, 11:49 AM IST

అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఈ వారం ప్రపంచ కుబేరుల జాబితా(వరల్డ్ బిలియనీర్స్) జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,755 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో మూడో వంతు మంది కేవలం 10 నగరాల్లోనే నివసిస్తున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. న్యూయార్క్ నుంచి షాంఘై వరకున్న ఈ జాబితాలో భారతీయ నగరమూ చోటు దక్కించుకుంది. అదెంటో మీరూ తెలుసుకోండి.

1. బీజింగ్

చైనాలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన బీజింగ్​ 100 మంది బిలియనీర్లతో అగ్రస్థానంలో నిలిచింది. వీరందరి సంపద 483.4 బిలియన్​​ డాలర్లుగా ఉంటుందని ఫోర్బ్స్ తెలిపింది. గతేడాది నాలుగో స్థానంలో ఉన్న ఈ నగరం ఈసారి అగ్రస్థానంలో నిలిచింది. కొత్తగా 33 మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. బొమ్మల(టాయ్స్​) వ్యాపారంలో రాణిస్తోన్న 34 ఏళ్ల వాంగ్​-నింగ్ కుబేరుల జాబితాలో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చారు.

ఇక ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ 'టిక్​టాక్​' వ్యవస్థాపకుడు జాంగ్​ ఇమింగ్ సంపద రెండితలై 35.6బిలియన్​ డాలర్లకు చేరుకుంది.

2.న్యూయార్క్

'ద బిగ్ ఆపిల్' గా వ్యవహరించే న్యూయార్క్​ నగరం 99 మంది బిలియనీర్లతో రెండో స్థానంలో నిలిచింది. బీజింగ్​తో పోలిస్తే కేవలం ఒక్క బిలియనీర్ మాత్రమే తక్కువ. ఈ నగరంలో కొత్తగా ఏడుగురు బిలియనీర్లుగా ఆవిర్భవించారు.

59 బిలియన్ డాలర్లతో 'మైఖేల్ బ్లూమ్‌బర్గ్' సంపన్న వ్యక్తిగా నిలిచారు.

3. హాంకాంగ్

హాంకాంగ్‌ 80 మంది బిలియనీర్లతో మూడో స్థానంలో నిలిచింది. వీరి నికర సంపద విలువ 448.4 బిలియన్ డాలర్లు. రిటైర్డ్ ఇన్వెస్టింగ్ లెజెండ్ లీ కా-షింగ్ సంపద 12 బిలియన్ డాలర్లు పెరిగింది.

రియల్ ఎస్టేట్ రంగంలో తిరోగమనం, హాంకాంగ్​ రాజకీయల్లో చైనా జోక్యం ఉన్నప్పటికీ 2020లో ఈ నగరంలో కొత్తగా తొమ్మిది మంది బిలియనీర్లుగా ఆవిర్భవించారు.

4. మాస్కో

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం రష్యా రాజధాని మాస్కోలో మొత్తం 79 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరందరి సంపద విలువ 420.6 బిలియన్ డాలర్లు. కొత్తగా తొమ్మిది మంది బిలియనీర్లుగా మారారు. 2020లో రష్యా జీడీపీ తగ్గినప్పప్పటికీ మెగా-బిలియనీర్లు లాభపడ్డారని ఫోర్బ్స్ తెలిపింది.

అలెక్సీ మోర్దాషోవ్ కుటుంబం 29.1 బిలియన్ డాలర్ల సంపదతో నగరంలోనే అత్యంత ధనిక కుటుంబంగా నిలిచింది.

5. షెన్‌జెన్

చైనా సిలికాన్ వ్యాలీగా పేరొందిన షెన్‌జెన్ నగరంలో 68 మంది బిలియనీర్ల జాబితాలో నిలిచారు. వారి సంపద 415.3 బిలియన్లుగా ఉంది. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ 'టెన్సెంట్' అధినేత మా హువాటెంగ్ 28 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచారు.

6. షాంఘై

చైనాలోని మరో అతిపెద్ద నగరం షాంఘైలో 64 మంది బిలియనీర్లు ఉన్నారు. వారి వద్ద 259.6 బిలియన్ డాలర్ల సంపద ఉన్నట్లు ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. 2020లో కొత్తగా 18 మంది బిలియనీర్లుగా మారారు.

దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ పిండుడుఓ అధినేత కోలిన్ హువాంగ్ 55 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు.

7. లండన్

63 మంది బిలియనీర్లతో లండన్‌ నగరం ఏడో స్థానంలో నిలిచింది. వీరందరి సమష్టి సంపద 316.1 బిలియన్ డాలర్లుగా ఉంది.

బ్రెగ్జిట్, కరోనా విజృంభణతో నగర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని ఫోర్బ్స్ అభిప్రాయపడింది. ఈ నగరంలో కొత్తగా ఏడుగురు బిలియనీర్లు ఈ జాబితాలో చోటు సంపాదించారు.

8. ముంబయి

భారత ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయిలో 48 మంది బిలియనీర్లు ఉన్నట్లు ఫోర్బ్స్ నివేదిక తెలిపింది. వీరందరి సంపద విలువ 265 బిలియన్ డాలర్లు.

ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో పదో స్థానంలో నిలిచి.. దేశంలో అపరకుబేరుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఆస్తుల విలువ దాదాపు 85 బిలియన్ డాలర్లు పెరిగింది.

9. శాన్​ఫ్రాన్సిస్కో

శాన్​ఫ్రాన్సిస్కో నగరంలోని మొత్తం 190 బిలియన్ డాలర్ల సంపదతో 48 మంది బిలియనీర్లుగా ఉన్నారు. ఈ నగరంలో నూతనంగా 11 మంది బిలియనీర్లుగా మారారు.

10. హాంగ్జౌ

చైనాలోని మరో నగరం టాప్​-10 నగరాల్లో నిలిచింది. అక్కడి హాంగ్జౌలో 47 మంది బిలియనీర్లు ఉండగా.. వారి సంపద 269 బిలియన్ డాలర్లుగా ఉంది. నూతనంగా 21 మంది బిలియనీర్లయ్యారు.

చైనా ప్రభుత్వం నుంచి చిక్కులు ఎదుర్కొంటున్నప్పటికీ అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా సంపద 9 బిలియన్ డాలర్లు పెరిగి 48 బిలియన్ డాలర్లకు చేరింది.

ఇవీ చదవండి:ప్రపంచ కుబేరుడిగా మళ్లీ బెజోసే

బ్యాంకు డిపాజిట్లు రూ.150 లక్షల కోట్లు

జాక్​మాపై చైనా ఆంక్షల కొరడా- భారీగా జరిమానా

సోఫా కావాలా.. అద్దెకు తెచ్చుకుందాం

Last Updated : Apr 11, 2021, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details