పవర్ బ్యాంక్‌కు ఛార్జ్ చేయడమంటే మనలో చాలామందికి పెద్ద పనిగా అనిపిస్తుంది. దాని కోసం ప్రత్యేకంగా ఛార్జర్‌ను తీసుకెళ్లటంపై అసౌకర్యంగా భావిస్తాం. అలాంటి ఇబ్బందులేవీ లేకుండా, ప్రత్యేక ఛార్జర్, సాకెట్ అవసరం లేని పవర్ బ్యాంకును అందుబాటులోకి తీసుకొచ్చింది బుల్ అనే సంస్థ. ఈ పవర్ బ్యాంక్ చాలా సౌకర్యంగా ఉంటుందని చెబుతోంది.
ఇన్‌బిల్ట్‌గా..
ఈ పవర్ బ్యాంక్‌తో ఏదేనీ డివైజ్‌ను ఛార్జ్ చేసేందుకు అంతర్గతంగా కేబుల్ ఉంటుందని చెబుతోంది. దీనితో పాటు.. పవర్ బ్యాంక్ ఛార్జింగ్‌కు పవర్ బ్రిక్ సైతం ఇన్‌బిల్ట్‌గా ఉండటమే దీని ప్రత్యేకత. దీని ఛార్జింగ్‌కు చేయాల్సిందల్లా ప్లగ్‌ను సాకెట్‌కు కనెక్ట్ చేయడమేనని కంపెనీ తెలిపింది. ఈ పవర్ బ్యాంక్ డిజైన్‌కు పోర్టులేమీ ఉండవు. అంతేగాక అంతర్గత ఛార్జింగ్ కేబుల్ ఉన్నందున అవుట్‌పుట్ పోర్ట్ అవసరం లేదు.