విమానయానంలో విప్లవం సృష్టించేందుకు అమెరికాలోని ఒట్టో ఏవియేషన్ సంస్థ సిద్ధమవుతోంది. 'సెలెరా 500ఎల్' పేరుతో తీసుకొచ్చిన సరికొత్త బుల్లెట్ విమానం ప్రస్తుతం సన్నాహక పరీక్షల దశలో ఉంది. కోడిగుడ్డు లేదా బుల్లెట్ రూపులో ఉన్న ఈ బుల్లి విమానం ఇతర లోహ విహంగాలకు భిన్నంగా (Celera 500L interior) ఎన్నో ప్రత్యేకతలతో వస్తోంది. విమానం ఉపరితలంపై గాలిని సాఫీగా వెళ్లేలా చేసి రాపిడిని తగ్గించేలా దీన్ని రూపొందించారు. తద్వారా తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం అధిక వేగంతో ప్రయాణించడమే దీని ప్రత్యేకత. తమ సెలెరా.. టర్బో జెట్ విమానాలతో పోలిస్తే 4-5 రెట్లు, జెట్ విమానాలతో పోలిస్తే 7-8 రెట్లు తక్కువగా ఇంధనాన్ని వినియోగించుకుంటుందని ఒట్టో ఏవియేషన్ సీఈవో విలియం చెప్పారు. ఓ గ్యాలన్ ఇంధనం (3.79 లీటర్లు) తో ఏకంగా 18-25 మైళ్లు ప్రయాణిస్తుంది. ఇదే పరిమాణంలో ఉండే బిజినెస్ క్లాస్ విమానాలతో పోల్చినా దీని నిర్వహణ ఖర్చు 80% తక్కువేనట. సెలెరా నడిచేందుకు గంటకు 328 డాలర్లు (Celera 500L price) ఖర్చవుతుంటే.. అదే పరిమాణంలో ఉండే బిజినెస్ క్లాస్ విమానానికి 2100 డాలర్ల వ్యయమవుతోంది.
డీజిల్ ఇంజిన్