అమెరికా విద్యుత్తు వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా దిగుమతి చేసుకునే వాహనాలతో మంచి ఫలితాలు వస్తే.. తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అయితే.. ప్రపంచంలోనే అత్యధిక దిగుమతి సుంకాలు భారత్‌లో ఉన్నాయని, కనీసం విద్యుత్ వాహనాలకు తాత్కాలిక ఉపశమనమైనా ఉంటుందని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
భారత మార్కెట్లోకి టెస్లా కార్లను తీసుకొచ్చే విషయంలో ఓ ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు ట్విట్టర్లో సమాధానమిచ్చారు మస్క్.
"మేము భారత్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం. కానీ, ఏ పెద్ద దేశంతో పోల్చినా.. ప్రపంచంలోనే అత్యధిక దిగుమతి సుంకాలు భారత్‌లో ఉన్నాయి. భారత్‌లో డీజిల్, పెట్రోల్ వాహనాలతో సమానంగా పర్యావరణ హిత వాహనాలను పరిగణిస్తున్నారు. అది వాతావరణ లక్ష్యాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. అయితే.. ఎలక్ట్రిక్ వాహనాలపై సుంకాల విషయంలో కనీసం తాత్కాలిక ఉపశమనమైనా ఉంటుందని ఆశిస్తున్నాను."
- ఎలాన్ మస్క్, టెస్లా సీఈఓ