2020 జనవరితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో టెక్నాలజీ ఉద్యోగ నియామకాలు 13 శాతం పెరిగినట్లు ఇండీడ్.కామ్ సంస్థ వెల్లడించింది. 2020 ఏప్రిల్ నెల నుంచి నియామకాలు పెరుగుతున్నాయని, గత నవంబరులో అత్యధికంగా ఉద్యోగ నియామకాలు 17 శాతం పెరిగినట్లు పేర్కొంది. ఐటీ, ఐటీఈఎస్, ఆర్థిక సేవలు, ఇ-కామర్స్, కన్సల్టింగ్ రంగాల కంపెనీలు పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తేల్చింది.
సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్, టెక్నికల్ లీడ్, క్లౌడ్ ఇంజినీర్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఫుల్ స్టేక్ డెవలపర్.. వంటి ఉద్యోగాలకు భారీగా జీతభత్యాలు లభిస్తున్నట్లు వివరించింది.