తెలంగాణ

telangana

ETV Bharat / business

టీడీఎస్, టీసీఎస్ రేట్లు 25 శాతం తగ్గింపు - టీడీఎస్, టీసీఎస్ రేట్లు 25శాతం తగ్గింపు

ఆత్మనిర్భర భారత్​ అభియాన్​లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. ప్రత్యక్ష పన్నుచెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ.. టీడీఎస్, టీసీఎస్ రేట్లను 25 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపారు. మార్చి 31 వరకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీని వల్ల పన్ను చెల్లింపుదారులకు రూ.50 వేల కోట్ల ప్రయోజనం కలుగుతుందన్నారు.

nirmala
నిర్మలా

By

Published : May 13, 2020, 5:53 PM IST

ప్రధానమంత్రి ప్రకటించిన ఆత్మనిర్భర భారత్​ అభియాన్ పథకం వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కరోనా ప్రభావిత ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదే విధంగా కీలక ప్రకటనలు చేశారు. ఇందులో భాగంగా ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు తీపి కబురు అందించారు.

ప్రస్తుతం ఉన్న టీడీఎస్, టీసీఎస్ రేట్లను 25 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపారు నిర్మల. రేపటి నుంచి మార్చి 31 వరకు టీడీఎస్, టీసీఎస్ రేట్ల తగ్గింపు అమలులో ఉంటుందన్నారు. ఈ వెసులుబాటు వల్ల ప్రజలకు సుమారు రూ.50 వేల కోట్ల ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు.

రిటర్నుల గడువు పెంపు

వ్యక్తిగత పన్ను చెల్లింపు గడువును పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి 2020 నవంబర్ 30 వరకు వెసులుబాటు కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details