కరోనా సంక్షోభం కారణంగా దేశ దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ లాభాలు క్షీణించాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లాభాలు 13.8 శాతం తగ్గి రూ.7,008 కోట్లకే పరిమితమైనట్లు సంస్థ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.8,131 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది టీసీఎస్.
తొలి త్రైమాసికంలో ఆదాయంపరంగా చూస్తే మాత్రం స్వల్ప వృద్ధి నమోదైంది. గతేడాది ఇదే సమయంలో రూ.38,172కోట్లుగా ఉన్న ఆదాయం.. ఈ ఏడాది రూ.38,322కోట్లకు పెరిగింది.