తెలంగాణ

telangana

ETV Bharat / business

టీసీఎస్​కు లాభాల పంట- 9 ఏళ్ల రికార్డ్ బ్రేక్ - మూడో త్రైమాసికం

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసస్​ (టీసీఎస్) మూడో త్రైమాసికంలో భారీ లాభాలు ఆర్జించింది. గత 9 ఏళ్లలో లేని విధంగా క్యూ3లో ఆ సంస్థ నికర లాభం 7.2 శాతం పెరిగింది.

TCS Q3 consolidated net profit up 7.2 pc year-on-year to Rs 8,701 cr, revenue rises 5.4 pc to Rs 42,015 cr
​లాభాలబాటలో టీసీఎస్!

By

Published : Jan 8, 2021, 6:47 PM IST

Updated : Jan 8, 2021, 7:22 PM IST

2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టీసీఎస్​కు లాభాల పంట పండింది. సంస్థ నికర లాభం 7.2శాతం పెరిగి రూ.8,701 కోట్లకు చేరింది. క్యూ3లో టీసీఎస్​ ఇంతటి లాభాన్ని ఆర్జించడం గత 9 ఏళ్లలో ఇదే తొలిసారి. గతేడాది ఇదే సమయానికి ఆ సంస్థ నికర లాభం రూ.8,118 కోట్లుగా ఉంది.

క్యూ3లో టీసీఎస్​ ఆదాయం 5.4 శాతం పెరిగి రూ. 42,015 కోట్లకు చేరింది.

"వినియోగదారులు పెరగడం, కోర్ ట్రాన్స్​ఫర్మేషన్​ సర్వీసెస్​కు డిమాండ్ పెరగడం ఇంతటి లాభాలకు ప్రధాన కారణం."

-రాజేశ్​ గోపీనాథన్, టీసీఎస్ సీఈఓ

అన్ని విభాగాల్లోనూ సంస్థకు లాభాలు వచ్చాయని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) రామకృష్ణన్​ తెలిపారు. ఈ లాభాలతో విపణిలో మరిన్ని అవకాశాలు రాబట్టుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి :టీకా జోష్​- మార్కెట్ల ఆల్​టైమ్​ రికార్డ్​

Last Updated : Jan 8, 2021, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details