తెలంగాణ

telangana

ETV Bharat / business

అత్యంత ప్రమాదకరంగా కార్పొరేషన్​ నీళ్లు!

దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో.. ప్రజలు కార్పొరేషన్​ పంపిణీ చేసే కుళాయి నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో బ్యూరో ఆఫ్​ ఇండియా స్టాండర్స్​ నీటి నాణ్యతపై చేదు నిజాల్ని వెల్లడించింది. హైదరాబాద్​ సహా.. దేశంలోని ప్రధాన నగరాల్లో కార్పొరేషన్ నీరు అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు తేల్చింది.

అత్యంత ప్రమాదకరంగా కార్పొరేషన్​ నీళ్లు!

By

Published : Nov 17, 2019, 5:21 AM IST

దేశంలోని ప్రధాన నగరాల్లోని ప్రభుత్వం పంపిణీ చేసే తాగునీటి ప్రమాణాలు నానాటికి పడిపోతున్నాయి. ఇందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ విడుదల చేసిన నివేదికే నిదర్శనం.

దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో తాగునీటి ప్రమాణాలపై రెండో దశ నివేదిక విడుదల చేసింది కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ. హైదరాబాద్​ సహా ఇతర నగరాల్లో పంపిణీ చేస్తోన్న నీళ్లు కలుషితంగా ఉన్నట్లు తేల్చింది.

మెట్రో నగరాలైన దిల్లీ, కోల్​కతా, చెన్నై నగరాల్లో తాగునీటి నమూనాలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్​) జరిపిన మొత్తం 11 నాణ్యత పరీక్షల్లో.. పదింటిలో విఫలమైనట్లు నివేదికలో తెలిసింది. దేశంలోని 17 రాష్ట్రాల రాజధాని పట్టణాల్లోని తాగునీటి నమూనాలు ప్రమాణాల ప్రకారం లేవని తేల్చింది బీఐఎస్​.

ముంబయి ఒక్కటే..

ముంబయిలో కార్పొరేషన్ నీళ్లు తాగేందుకు సురక్షితంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. ఆర్థిక రాజధానిలోని నీళ్లు 11 ప్రమాణాలను పాటిస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో ముంబయి నివాసితులు ప్రత్యేకించి రివర్స్ ఆస్మోసిస్​ (ఆర్​ఓ) పరికరాలను కొనాల్సిన అవసరం లేదని పేర్కొంది వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ.

రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు..

నీటి నాణ్యతపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి లేఖలు రాసినట్లు తెలిపారు కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ మంత్రి రామ్​ విలాస్​ పాసవాన్​. తాగునీటి ప్రమాణాలపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రస్తుతం తప్పని సరేమీకాదు.. కానీ ఒక సారి ఆ నిబంధన అమలైతే తాము చర్యలు తీసుకుంటామని పాసవాన్​ పేర్కొన్నారు.

హైదరబాద్​లో సురక్షితమేనా?

తాజా నివేదికలో హైదరాబాద్​ కార్పొరేషన్ నీటి నామూనాలు.. మొత్తం 11 ప్రమాణాల్లో ఒకదాంట్లో విఫలమైనట్లు తెలిసింది. నగర నీటి నమూనాలు.. పెనోలిక్ సమ్మెళనాల ప్రమాణాలకు అనుగుణంగా లేవని నివేదిక పేర్కొంది.

13 నగరాల్లో అత్యంత ప్రమాదకరం..

చెన్నై, కోల్​కతా, బెంగళూరు, గాంధీనగర్, లఖ్​నవూ, గువాహటీ, చంఢీగఢ్​​, దెహ్రదూన్​, జమ్ము, జైపుర్​ సహా మొత్తం 13 నగరాల్లో తాగునీటి నమూనాలు.. ప్రమాణాల పరీక్షలో విఫలమయ్యాయి. చెన్నైలో సేకరించిన 10 నమూనాలు.. 9 పరీక్షల్లో విఫలమైనట్లు తేలింది.

మూడో దశలో..

ఈశాన్య రాష్ట్రాల్లోని 100 స్మార్ట్​సిటీల్లో నీటి శాంపిళ్లు సేకరించి ​పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బీఐఎస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నివేదికను 2020 జనవరి 15న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

నాలుగో దశలో..

దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి నీటి శాంపిళ్లు సేకరించి.. 2020 ఆగస్టు 15 నాటికి వాటి ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆర్​కామ్​ డైరెక్టర్​ పదవికి అనిల్ అంబానీ రాజీనామా

ABOUT THE AUTHOR

...view details