ప్రపంచంలోనే అతి గొప్ప హోటల్ బ్రాండ్‌గా తాజ్ హోటల్స్ నిలిచినట్లు ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్-IHCL వెల్లడించింది. 2021 ఏడాది గాను గ్లోబల్ ఫైనాన్స్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ నిర్వహించిన అధ్యయనంలో..ప్రపంచం లోనే 50 గొప్ప హోటళ్లలో తాజ్ బ్రాండ్ తొలిస్థానంలో నిలిచింది. మార్కెటింగ్ పెట్టుబడి, కస్టమర్లు-సిబ్బంది సంతృప్తితో పాటు కార్పొరేట్ ఖ్యాతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులను కేటాయించారు. ఈ సర్వేలో.. 296 మిలియన్ డాలర్లతో తాజ్ ప్రపంచంలోనే గొప్ప హోటల్ బ్రాండ్‌గా నిలిచినట్లు బ్రాండ్ ఫైనాన్స్ వెల్లడించింది. అలాగే బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్-BSI లో 100కి 89.3 పాయింట్లను సాధించినట్లు చెప్పింది.
ప్రపంచంలోనే గొప్ప హోటల్ బ్రాండ్‌గా తాజ్!
తాజ్ హోటల్స్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోని 50 గొప్ప హోటళ్లలో తాజ్ బ్రాండ్ అగ్రస్థానంలో నిలిచింది. 2016లో నిర్వహించిన ఇదే తరహా సర్వేలో తొలిసారి టాప్ 50లోకి అడుగుపెట్టిన తాజ్ బ్రాండ్‌కు ఆ ఏడాది 38వ స్థానం దక్కింది.
ప్రపంచంలోనే గొప్ప హోటల్ బ్రాండ్‌గా తాజ్!
2016లో నిర్వహించిన ఇదే తరహా సర్వేలో తొలిసారి టాప్ 50లోకి అడుగుపెట్టిన తాజ్ బ్రాండ్ ఆ ఏడాది 38వ స్థానంలో నిలిచింది. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ప్రిమియర్ ఇన్ రెండోస్థానంలో నిలవగా మెలియా హోటల్స్ ఇంటర్నేషనల్ , NH హోటల్ గ్రూప్, షాంగ్రీ లా హోటల్స్ అండ్ రిసార్ట్స్ తరువాతి స్థానాల్లో నిలిచాయి.
ఇదీ చదవండి :'స్టాక్మార్కెట్లో మరో ఏడాది పాటు బుల్దే హవా!'